Papaya Leaves Juice : బొప్పాయి పండు.. ఇది మనందరికీ తెలిసిందే. దీనిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ బొప్పాయి పండు మనకు ఎంతగానో సహాయపడుతుంది. బొప్పాయి పండు మాత్రమే కాకుండా బొప్పాయి చెట్టు ఆకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. బొప్పాయి ఆకులను ఆయుర్వేదంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఔషధంగా ఉపయోగిస్తారు.
మనందరికీ అందుబాటులో ఉండే బొప్పాయి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజూ ఉదయం బొప్పాయి ఆకులతో జ్యూస్ ను చేసుకుని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆకుల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఈ ఆకులు మనకు ఉపయోగపడతాయి.
తరచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడే వారు ఈ ఆకుల జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్ ల బారిన పడకండా ఉంటారు. యాంటీ మలేరియా గుణాలను కూడా ఈ ఆకులు కలిగి ఉంటాయి. బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల మలేరియా జ్వరం త్వరగా తగ్గుముఖం పడుతుంది. అదే విధంగా డెంగ్యూను నివారించడంలో కూడా బొప్పాయి ఆకులు మనకు ఉపయోగపడతాయి. బొప్పాయి ఆకుల రసాన్ని రోజూ 2 టీస్పూన్ల మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య పెరగడంతోపాటు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా డెంగ్యూ జ్వరం నుండి బయటపడవచ్చు.
బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించాలి. ఇలా మరిగించిన నీరు చల్లగా అయిన తరువాత వడకట్టుకుని తాగడం వల్ల స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజూ బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు తొలగిపోతాయి. అలాగే ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో 10 గ్రాముల బొప్పాయి ఆకుల పొడిని వేసి కలుపుకుని తాగడం వల్ల ఎంతటి జ్వరమైనా కూడా వెంటనే తగ్గిపోతుంది.
బొప్పాయి ఆకుల పొడిని లేదా రసాన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. చర్మ సంబంధిత సమస్యలను సయం చేయడంలో కూడా బొప్పాయి ఆకులు మనకు దోహదపడతాయి. ఈ ఆకుల పొడిలో నీటిని కలిపి పేస్ట్ గా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలతోపాటు ఇతర చర్మసంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి.
అలాగే ఈ ఆకుల పేస్ట్ ను జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా బొప్పాయి ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ ఆకులను పైన తెలిపిన విధంగా వాడడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడంతోపాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయని.. నిపుణులు చెబుతున్నారు.