politics

కేఏ పాల్ మాన‌సిక ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా ఉండ‌దా..? ఆయ‌న ఎందుకు అలా పిచ్చిప‌ట్టిన‌ట్లు మాట్లాడ‌తారు..?

త‌న‌కు ఓట్లేస్తే ఆంధ్రాను అమెరికాగా మారుస్తాన‌ని కేఏ పాల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. అయినా ఎవ‌రూ ఆయ‌నకు ఓట్లు వేయ‌లేదు. అయితే మీడియా మాత్రం ఆయ‌న ఎప్పుడు మాట్లాడినా భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. వాస్త‌వానికి ఆయ‌న పార్టీకి ఏపాటి పేరుందో అంద‌రికీ తెలుసు. అలాంటిది ఆయ‌న‌కు అంత‌గా ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల్సిన ప‌నిలేదు. కానీ ఆయ‌న ఏం మాట్లాడినా కూడా మీడియా మ‌రీ అతి చేసి చూపిస్తుంది. స‌రే ఈ విష‌యం అటుంచితే.. కేఏ పాల్ ఏమైనా మ‌తి స్థిమితం స‌రిగ్గా లేనివారా.. అంటే.. కాదు. ఆయ‌న‌కు మ‌తి బాగానే ఉంటుంది. కాక‌పోతే ఆయ‌న మాట్లాడే అతిశ‌యోక్తి మాటల వ‌ల్లే మీడియాలో ఆయ‌న ఎక్కువ‌గా క‌నిపిస్తారు. దీంతో ఆయ‌న‌ను అంద‌రూ స‌హ‌జంగానే మ‌తి స్థిమితం లేదేమో అని లేదా జోక‌ర్ అని భావిస్తారు.

ఇక కేఏ పాల్‌కు సొంత మీడియా కూడా లేదు. ఆయ‌న వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో మాత్రం వైర‌ల్ అవుతూనే ఉంటాయి. అందువ‌ల్లే ఆయ‌న‌ను మీడియా మ‌రీ అతిగా చూపిస్తుంది. దాన్ని చూసి ఆయ‌న మ‌రింత రెచ్చిపోయి మాట్లాడ‌తారు. అందువల్ల ఆయ‌న‌కు మ‌తిలేద‌ని అనుకోవ‌ద్దు. ఆయ‌న ఒక పాస్ట‌ర్‌గా దేవుడు నా చేతిలో ఉన్నాడ‌ని అంటారు. ప్ర‌పంచ అధ్య‌క్షులు, ప్ర‌ధాన మంత్రులు త‌న చేతిలో ఉన్నార‌ని, ఇప్ప‌టికిప్పుడు ఇండియాకు ల‌క్ష‌ల కోట్ల నిధులు తెస్తాన‌ని అంటారు. ఈ మాట‌ల్లో ఎంత నిజం ఉందో ఆ దేవుడికే తెలియాలి.

is everything ok with ka paul

కేఏ పాల్ రాజ‌కీయ పార్టీని స్థాపించినా కూడా గెల‌వ‌లేక‌పోయారు. కానీ ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మాత్రం ప‌దే ప‌దే అవాకులు చెవాకులు పేలుతుంటారు. అలాగే చంద్ర‌బాబును కూడా విమ‌ర్శిస్తారు. ఆయ‌న మాట‌ల‌ను ఆయా పార్టీలో ఉన్న ఎవ‌రూ ప‌ట్టించుకోరు. అందుక‌నే అంద‌రూ ఆయ‌న‌ను ఒక బ‌పూన్‌లా చూస్తారు. అయితే కేఏ పాల్ చేసే విమ‌ర్శ‌లు మాట్లాడే మాట‌లు స‌ద్విమ‌ర్శ‌లా ఉంటే ఎవ‌రైనా ఆమోదిస్తారు. కానీ ఆయ‌న‌కు అలా మాట్లాడ‌డం చేత‌కాద‌ని భావిస్తారు. త‌న మాట తీరును మార్చుకుంటే అయినా ప్ర‌జ‌ల్లో కొద్దిగా వ్య‌క్తిత్వం ఉన్న మ‌నిషిలా క‌నిపిస్తారేమో. అలా కాకుండా జోక‌ర్ లా మాట్లాడిన‌న్ని రోజులు ప్ర‌జ‌లు, నాయ‌కులు ఆయ‌న‌ను అలాగే ట్రీట్ చేస్తారు.

Admin

Recent Posts