అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ ద్రాక్ష పండ్ల ర‌సాన్ని తాగితే డ‌యాబెటిస్ దూరం..!

మధుమేహ రోగులకు శుభవార్త…! అదేంటంటే మధుమేహ వ్యాధిని పారద్రోలేందుకు ద్రాక్ష ర‌సాన్ని సేవిస్తుంటే మధుమేహం మటుమాయమౌతుందని అమెరికా పరిశోధకులు తెలిపారు. ద్రాక్ష ర‌సాన్ని సేవిస్తుంటే అధిక రక్తపోటు క్రమబద్దీకరించి మధుమేహ వ్యాధిని పారద్రోలుతుందని అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. తొలుత తాము ఎలుకలపై పరిశోధించి వాటికి పచ్చ, ఎరుపు, నలుపు రంగు కలిగిన ద్రాక్షపండ్లతో పాటు అమెరికాకు చెందిన అత్యధిక కొవ్వు కలిగిన ఆహారాన్ని ఇచ్చినట్లు పరిశోధకులు తెలిపారు.

వీటితోపాటు మరికొన్ని ఎలుకలకు కేవలం కొవ్వు, చక్కెర శాతం ఎక్కువగానున్న ఆహారాన్ని ఇచ్చామని, మూడు నెలల తర్వాత వీటిని పరీక్షిస్తే ద్రాక్షపండ్లు ఇచ్చిన ఎలుకల్లో రక్తపోటు, గుండెకు సంబంధించిన జబ్బులు ఏ మాత్రం లేవ‌ని తమ పరిశోధనల్లో తేలినట్లు వారు పేర్కొన్నారు.

take black grapes juice daily to control diabetes

నల్లద్రాక్ష పుల్లగా వుండటం చేత ఇప్పటికే చాలామంది డయాబెటిక్ రోగులు ప్రతిదినం వారు తాగే పండ్లరసాలలో ద్రాక్ష రసాన్ని కూడా చేరుస్తుంటారు. సహజ సిద్ధమైన ద్రాక్షపండు డయాబెటీస్ రోగులకే కాదు ఇతరులకు కూడా ప్రతి రోజూ ఒక గ్లాసు రసంగా తీసుకుంటే అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలుండగలవని పరిశోధకులు చెపుతున్నారు.

Admin

Recent Posts