తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు మంత్రి కొండా సురేఖ శుభవార్త చెప్పారు. ఆమె శనివారం కీలకమైన ప్రకటన చేశారు. కార్తీక మాసం ప్రారంభం అయిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఆమె శుభవార్తను చెప్పారు. కార్తీక మాస దీపోత్సవాల్లో పాల్గొనే మహిళలకు రెండు మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీస్‌లను ఇవ్వాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె ఆదేశాలు ఇచ్చారు.
శనివారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కాగా మంత్రి కొండా సురేఖ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్తీక మాసం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శివాలయాలు భక్తుల రద్దీతో సందడిగా మారాయి. ఇప్పటికే చాలా మంది శివ దర్శనం కోసం ఆలయాలకు క్యూ కట్టారు. కార్తీక మాసం కావడంతో కొందరు ప్రత్యేక పూజలను కూడా ప్రారంభించారు.
కార్తీక మాసంలో సహజంగానే మహిళలకు అనేక వస్తువుల అవసరం ఉంటుంది. అందుకనే మంత్రి కొండా సురేఖ ఇలా ప్రకటన చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా దీపోత్సవాల్లో పాల్గొనే మహిళలకు ప్రమిదలు, నూనె, వత్తులు, పసుపు, కుంకుమ లాంటివి అవసరం అవుతాయి. అందుకనే ఆమె వాటిని ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.