ఒక మాట అయితే విన్నాను. ఎన్టీ రామారావు నిమ్మకూరులో ఉండగా ఆయనకి సంబంధించిన భూముల వ్యవహారంలో ఈ కారణాలు చూపి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అందుకే ఆ వ్యవస్థ మీద రామారావుకి ఎక్కువగా కోపం ఉంది అనే మాట బయటికి వచ్చింది. అనుకోకుండా ఎన్టీఆర్ సీఎం అయ్యారు తెలుగుదేశం పార్టీ పెట్టి. అవకాశం దొరికింది ఈ వ్యవస్థను రద్దు చేయాలి అనుకున్నారు. మంచి చెడు ప్రతి చోటా ఉంటుంది రిజిస్టర్ ఆఫీసులో తాలూకా ఆఫీసులో అన్ని చోట్ల ఈ అవినీతి కరప్షన్ ఎక్కువగా ఉంది. అన్ని వ్యవస్థలు అలాగే ఉన్నాయి.
కరణాల వ్యవస్థ రద్దు అయిపోయాక వీఆర్ఏలు వచ్చారు. వీళ్లు గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగేశారు. ఇంకా ఎక్కువ అయింది. నేను మా పొలం విషయంలో మూడు నెలలు హైదరాబాదు నుండి ఏలూరుకి తిరుగుతూ ఉండేవాడిని ఆ పని చేయటానికి 30 వేలు ఖర్చు అయింది. ఇన్నిసార్లు తిరిగి అంత ఖర్చు పెట్టే కంటే వాడికి 30,000 ఇచ్చేస్తే పోయే అని నిర్ణయానికి వచ్చి పని పూర్తి చేయించాము.
ఎన్టీఆర్ ఆ ఒక్క విషయాన్ని పట్టించుకోవటం తప్పు. ఇందుగలడు అందు లేడు అనే విషయం తెలుసు కాబట్టి ప్రతి చోట ఉన్న అవినీతిని తొలగించడానికి చర్యలు తీసుకునే ఉంటే బాగుండేది. ఏమైత నేమి ఆ వ్యవస్థ రద్దు అయింది. ఆయన మీద కరణాలకు కోపం ఎక్కువగా ఉండేది. చాలామంది అందుకే టిడిపి మీద కోపంగా ఉంటారు అలా నష్టపోయిన వారు. ఇప్పుడు కూడా ఉన్నారు కానీ చంద్రబాబు ఆ పని చేయలేదు. కొద్ది కొద్దిగా మార్పు వచ్చింది ఇప్పుడు.