డ‌యాబెటిస్ ఉన్న‌వారు కార్న్ ఫ్లేక్స్ తిన‌వ‌చ్చా ?

కార్న్ ఫ్లేక్స్ అనేవి చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. టీవీల్లో, ప‌త్రిక‌ల్లో వాటి యాడ్‌ల‌ను చూడ‌గానే ఎవ‌రికైనా వాటిని తినాల‌నే కోరిక క‌లుగుతుంది. కంపెనీల యాడ్స్ జిమ్మిక్కులు అలాగే ఉంటాయి. అయితే నిజానికి కార్న్ ఫ్లేక్స్ డ‌యాబెటిస్ ఉన్న‌వారికి అస‌లు ఏ మాత్రం ప‌నికి రావు. డ‌యాబెటిస్ ఉన్న‌వారు వాటిని అస్స‌లు తిన‌రాదు.

can diabetics eat cornflakes

కార్న్ ఫ్లేక్స్ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) 82. అంటే చాలా ఎక్కువ అన్న‌మాట‌. జీఐ విలువ ఎక్కువ ఉందంటే.. ఆ ప‌దార్థాన్ని తిన్న వెంట‌నే ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయ‌ని అర్థం. అంటే డ‌యాబెటిస్ ఉన్న‌వారు జీఐ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను అస్స‌లు తిన‌రాదు. వాటి వ‌ల్ల ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. అది ఏమాత్రం మంచిదికాదు. అందువ‌ల్ల కార్న్ ఫ్లేక్స్ జీఐ కూడా ఎక్కువే క‌నుక వాటిని కూడా డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులు తిన‌రాదు. తింటే ఏమాత్రం లాభం జ‌ర‌గ‌క‌పోగా న‌ష్టం జ‌రుగుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ విప‌రీతంగా పెరుగుతాయి. దీంతోపాటు శ‌రీరంలో కొవ్వు నిల్వ‌లు పెరుగుతాయి. ఫ‌లితంగా డ‌యాబెటిస్ తీవ్ర‌త‌రం అవ‌డంతోపాటు గుండె జ‌బ్బులు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం) ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తినాలి. దీని వ‌ల్ల ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్క‌సారిగా పెర‌గ‌వు. ఫ‌లితంగా షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే తాజా కూర‌గాయల‌తోపాటు బాదంప‌ప్పు, బెర్రీలు, యాపిల్స్, సోయా మిల్క్ వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts