ప్ర‌శ్న - స‌మాధానం

Honey For Pregnant Women : గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు తేనెను తీసుకోవ‌చ్చా.. లేదా..?

Honey For Pregnant Women : గర్భిణీలు ఆరోగ్యం విషయంలో, చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలు ఆరోగ్యం విషయంలో, ఎలాంటి పొరపాట్లు కూడా చేయకూడదు. తేనె లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. తేనెను తీసుకోవడం వలన ఎన్నో లాభాలు పొందవచ్చు. తేనెను తీసుకుంటే, చాలా సమస్యలకి దూరం అవ్వచ్చు అనే విషయం మనకి తెలుసు. గర్భిణీలు తేనెను తీసుకోవచ్చా..? తీసుకోకూడదా అనే సందేహం ఉంది. మరి మీకు కూడా సందేహము ఉంటే, ఇప్పుడే తెలుసుకోండి. గర్భిణీలు తేనె తీసుకోవడం వలన, ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు.

పోషకాలు పుష్కలంగా తేనెలో ఉంటాయి. కాబట్టి, గర్భిణీలు తీసుకోవడం మంచిదే. ముఖ్యంగా, ప్రెగ్నెన్సీ టైంలో తేనె తీసుకుంటే, మార్నింగ్ సిక్నెస్ సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. తేనె లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. గర్భిణీలు లో పొడి దగ్గు సమస్య ఉన్నట్లయితే, మందులు వేసుకోకుండా తేనెను తీసుకుంటే, గొంతు సమస్య దూరం అవుతుంది. అలానే, హెల్తీ బ్రీతింగ్ కూడా ఉంటుంది. హ్యాపీగా దగ్గు తగ్గిపోతుంది కూడా.

can pregnant women take honey

మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో, మలబద్ధకంతో బాధపడతారు. అజీర్తి సమస్యలు కూడా ఉంటాయి. తేనె తీసుకుంటే, ఈ సమస్యలు తగ్గుతాయి. తేనెను ఎక్కువ తీసుకోవడం వలన, చక్కెర స్థాయిలో పెరిగిపోతాయి. డెలివరీ టైం లో ప్రెగ్నెన్సీలో షుగర్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, ఎక్కువ మోతాదురు తీసుకోవడం మంచిది కాదు. తేనెని ఎక్కువగా తీసుకుంటే, బరువు పెరిగి పోయే అవకాశం కూడా ఉంది.

బరువు పెరిగితే సుఖ ప్రసవం అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. తేనెలో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. కొంతమందికి ఎలర్జీ సమస్యలు వస్తాయి. చర్మంపై దురద, చర్మం ఎర్రగా మారిపోవడం లేదంటే దద్దుర్లు వంటి ఇబ్బందులు కలుగుతాయి. లిమిట్ గా మాత్రమే తేనెను తీసుకోండి. ఎక్కువగా తీసుకోకండి. మీ కండిషన్ ని బట్టి డాక్టర్ని అడిగి దాన్ని బట్టి తీసుకోవడం మంచిది.

Admin

Recent Posts