రోజూ చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధికంగా బరువు పెరుగుతారు. దీంతో అధిక బరువును తగ్గించుకోవడం కష్టంగా మారుతుంది. అందువల్ల చక్కెరకు బదులుగా సహజసిద్ధమైన తీపి పదార్థాలైన తేనె, బెల్లంలను ఉపయోగించాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే తేనె, బెల్లం రెండూ సహజసిద్ధమైనవే అయినా.. ఈ రెండింటిలో ఏది మంచిది ? బరువును తగ్గించేందుకు ఏది బాగా పనిచేస్తుంది ? అంటే..
బెల్లంను సాంప్రదాయ భారతీయ వంటకాల్లో ఎప్పటి నుంచో ఉపయెగిస్తున్నారు. దీంతో వంటకాలకు చక్కని రుచి వస్తుంది. ఇక బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. పొటాషియం, మెగ్నిషియం, విటమిన్లు బి1, బి6, సి వంటి పోషకాలు ఉంటాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. ఆయుర్వేద ప్రకారం రోజూ ప్రతి ఒక్కరూ బెల్లంను తినాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. బెల్లంలో అనేక ఫినోలిక్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. దీంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
ఇక తేనె కూడా అద్భుతమైన పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇది సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అధిక బరువును తగ్గించుకునేందుకు సహాయ పడుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది.
అయితే తేనె, బెల్లం.. రెండింటిలో ఏది మంచిది ? అంటే రెండూ మంచివే. మన శరీరాన్ని ఆరోగ్యాన్ని ఉంచడంలో రెండూ సహాయ పడతాయి. ఇక అధిక బరువును తగ్గించడంలోనూ రెండూ సహాయ పడతాయి. కానీ తేనె ఇంకా ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. తేనెను తీసుకోవడం వల్ల మెటబాలిజం పెరిగి అధిక బరువు తగ్గుతారు. బెల్లం వల్ల క్యాలరీలు ఎక్కువగా వస్తాయి కనుక అధిక బరువు నెమ్మదిగా తగ్గుతారు. కానీ తేనెను ఉపయోగిస్తే అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. కనుక తేనె, బెల్లంలలో అధిక బరువును తగ్గించుకునేందుకు తేనె ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలిపి తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365