దాల్చిన చెక్క చక్కని సువాసనను కలిగి ఉంటుంది. అందువల్లే దీన్ని అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. ముఖ్యంగా బిర్యానీలు, మాంసాహార వంటలు, మసాలా వంటల్లో దీన్ని వేస్తారు. దీంతో వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అయితే రుచి మాత్రమే కాదు, దాల్చిన చెక్క అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో అనేక పోషక విలువలు, ఔషధ గుణాలు ఉంటాయి. అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఇందులో ఉంటాయి. దాల్చిన చెక్కను రోజూ తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. హైబీపీ, క్యాన్సర్, స్థూలకాయం సమస్యల నుంచి బయట పడవచ్చు.
అయితే దాల్చిన చెక్క అందరికీ ఆరోగ్యకరమైన ప్రయోజనాలనే అందిస్తుంది. కానీ అందులో ఉండే సమ్మేళనాలు కొందరికి పడవు. అవి వారికి హాని కలగజేస్తాయి. అందువల్ల దాల్చిన చెక్కను తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి.
దాల్చిన చెక్కలో కౌమరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. అందువల్ల దాల్చిన చెక్కకు ఆ రుచి వస్తుంది. దీన్ని రక్తాన్ని పలుచన చేసే మెడిసిన్ల తయారీలో వాడుతారు. అందువల్ల రక్తాన్ని పలుచన చేసే మెడిసిన్లను ఇప్పటికే వాడుతున్న వారు దాల్చిన చెక్కను తీసుకోరాదు.
అలర్జీలు లేదా జీర్ణ సమస్యల కారణంగా కొందరికి నోట్లో పుండ్లు, పూతలు వస్తుంటాయి. చాలా మందికి ఇవి సహజంగానే వస్తుంటాయి, పోతుంటాయి. అయితే ఈ సమస్యలు ఉన్నప్పుడు దాల్చిన చెక్కను తీసుకోరాదు. తీసుకుంటే ఆ సమస్యలు ఇంకా ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక వారు దాల్చిన చెక్కను వాడరాదు.
దాల్చిన చెక్కలో ఉండే కౌమరిన్ లివర్‌ను దెబ్బ తీస్తుంది. కనుక లివర్ సమస్యలు ఉన్నవారు, కామెర్లు అయిన వారు దాల్చిన చెక్కను వాడరాదు.
గర్భిణీలు దాల్చిన చెక్కను తీసుకోరాదు. ఇది వారిలో ముందస్తు డెలివరీ అయ్యేలా చేస్తుంది. శిశువులు నెలలు నిండకుండానే పుడతారు. అలాగే గర్భాశయంలో సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల గర్భిణీలు దాల్చిన చెక్కను తీసుకోరాదు.
రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే దాన్ని హైపర్ గ్లైసీమిక్ స్థితి అంటారు. అయితే కొందరికి రక్తంలో ఉండాల్సిన స్థాయిలో కూడా షుగర్ లెవల్స్ ఉండవు. తక్కువగా ఉంటాయి. దీంతో వారు ఎల్లప్పుడూ స్పృహ తప్పిపోతుంటారు. అలాంటి వారిలో సహజంగానే షుగర్ లెవల్స్ బాగా తక్కువగా ఉంటాయి కనుక వారు దాల్చిన చెక్కను తీసుకోరాదు. తీసుకుంటే షుగర్ లెవల్స్ ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది. కనుక వారు దాల్చిన చెక్కను వాడడం మానేయాలి.
ఇక దాల్చిన చెక్కను సరైన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. కేజీ బరువుకు 0.1 మిల్లీగ్రాముల దాల్చిన చెక్క పొడిని తీసుకోవచ్చు. అంటే సుమారుగా 70 కిలోల బరువు ఉండే వ్యక్తి 7 ఎంజీ మోతాదులో మాత్రమే దాల్చిన చెక్కను వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా సురక్షితంగా దాల్చిన చెక్కను వాడుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365