Pumpkin Seeds : రోజూ సాయంత్రం అవగానే చాలా మంది రకరకాల స్నాక్స్ తింటుంటారు. అయితే మనకు ఆరోగ్యాన్ని అందించే స్నాక్స్‌ను మాత్రమే తినాలి. నూనె పదార్థాలు, బేకరీ ఆహారాలు, ఇతర జంక్ ఫుడ్‌లను తింటే మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ క్రమంలోనే చాలా మంది సాయంత్రం వేళ నట్స్, సీడ్స్‌ను తింటుంటారు. ముఖ్యంగా సీడ్స్ విషయానికి వస్తే చాలా మంది తినే వాటిల్లో గుమ్మడికాయ విత్తనాలు కూడా ఒకటి. వీటిని కొందరు రోస్ట్ చేసి తింటారు. కొందరు సలాడ్స్‌లో వేసి తింటారు. ఇంకా కొందరు ఉడకబెట్టి తింటారు. కొందరు నీటిలో నానబెట్టి తింటారు.
ఎలా తిన్నా సరే గుమ్మడికాయ విత్తనాలను తింటే మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. గుమ్మడికాయ విత్తనాలను రోజూ తింటే అనేక లాభాలు కలుగుతాయి. వీటితో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. జుట్టు పెరుగుతుంది. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. అయితే గుమ్మడికాయ విత్తనాలను రోజుకు ఎన్ని తినాలి అని చాలా మంది సందేహిస్తుంటారు. ఇందుకు వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు 30 గ్రాముల మోతాదులో గుమ్మడికాయ విత్తనాలను తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. అంతకు మించితే వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. కనుక గుమ్మడికాయ విత్తనాలను మోతాదులో తినడం వల్ల ముందు చెప్పిన లాభాలను పొందవచ్చు. ఏదీ అతిగా తినకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే మంచిది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.