రోజూ ఒక క‌ప్పు గ్రీన్ లేదా బ్లాక్ టీతో హైబీపీ త‌గ్గుతుంది.. సైంటిస్టుల వెల్ల‌డి..!

టీ ప్రేమికులు నిత్యం ర‌క ర‌కాల టీల‌ను తాగేందుకు చూస్తుంటారు. కొంద‌రు కేవ‌లం సాధార‌ణ టీ తోనే స‌రిపెట్టుకుంటారు. కానీ కొంద‌రు గ్రీన్ టీ, బ్లాక్ టీ.. ఇలా వెరైటీ వెరైటీ టీ ల‌ను తాగుతుంటారు. అయితే నిత్యం ఒక‌ప్పు గ్రీన్ లేదా బ్లాక్ టీని తాగ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

a cup of green tea or black tea per day reduces high blood pressure

యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన సైంటిస్టులు కంప్యూట‌ర్ మోడ‌ల్ ఆధారంగా ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో వెల్ల‌డైందేమిటంటే.. నిత్యం ఒక క‌ప్పు గ్రీన్ లేదా బ్లాక్ టీని తాగ‌డం వ‌ల్ల వాటిల్లో ఉండే కాటెచిన్ త‌ర‌హా ఫ్లేవ‌నాయిడ్స్ రక్త నాళాల‌ను ప్ర‌శాంత ప‌రుస్తాయి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. అలాగే హైబీపీ త‌గ్గుతుంది.

అందువ‌ల్ల నిత్యం ఒక క‌ప్పు గ్రీన్ టీ లేదా బ్లాక్ టీని తాగాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు. వారి ప‌రిశోధ‌నల తాలూకు వివ‌రాల‌ను సెల్యులార్ ఫిజియాల‌జీ అండ్ బ‌యో కెమిస్ట్రీ అనే జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు. అయితే గ్రీన్ లేదా బ్లాక్ టీ.. రెండింటిలో ఏది తాగినా స‌రే వాటిల్లో పాలు, చ‌క్కెర‌ను క‌ల‌ప‌కుండా తాగితేనే ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని సైంటిస్టులు తెలిపారు.

Share
Admin

Recent Posts