అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ 3 అర‌టి పండ్లతో గుండె పోటుకు చెక్‌..!

రోజూ మూడు అరటి పండ్లను తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్ పెట్టవచ్చనని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటీష్-ఇటాలియన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో రోజూ వారీగా మూడు అరటిపండ్లు తీసుకునే వారిలో హృద్రోగ సమస్యలు చెక్ పెట్టవచ్చునని తేలింది. రోజూ ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌లో మూడో అరటిపండును తీసుకునే వారిలో శరీరంలో పొటాషియం శాతం పెరుగుతుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు.

కాగా, నట్స్, పాలు, చేపలు వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే, మూడు అరటిపండ్లు రోజూవారీగా తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటు వంటి వాటిని చాలామటుకు తగ్గించుకోవచ్చని వారు చెబుతున్నారు. సోడియం అధికంగా గల ఆహారం తీసుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవుతోందని వార్వింక్ యూనివర్శిటీ నిర్వహించిన స్టడీలో తేలింది.

banana is very much useful in heart health

అయితే రోజూ మూడు అరటి పండ్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని సోడియం శాతాన్ని తగ్గించి, గుండెపోటును నియంత్రించవచ్చునని కూడా ఆ పరిశోధనలో తేలింది.

Admin