చిట్కాలు

హ్యాంగోవ‌ర్‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..!

ఇంట్లో చేసుకునే చిట్కాలతో తరచుగా వచ్చే తలనొప్పులు తగ్గించుకోవడం తేలికే. ప్రతి చిన్న తలనొప్పికి టాబ్లెట్లు మింగాల్సిన అవసరం లేదు. తలనొప్పిని సహజ పరిష్కారాలతో నయం చేసుకోవచ్చు. సహజ పరిష్కారం ఉండగా రకరకాల మందులు వేసి శరీరానికి ఇబ్బంది కలిగించటం మంచిది కాదు. పై పెచ్చు హెర్బల్ వంటి సహజ వైద్యం ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ కు అవకాశమివ్వదు కూడా. తలనొప్పులకు ఇంటి వైద్యం మంచిదంటారు. ఎందుకంటే.. ఇంట్లో చేసుకునే వైద్యం సహజమైనది కనుక. పారాసిటమాల్ లేదా యాస్ప్రిన్ ల వలే శరీరంలో సహజ ఔషధాలు హాని కలిగించవు. ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ సమయంలో వాటిని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు.

ఇంట్లో చేయదగిన చిట్కాలు ఇవి. నొప్పితో తల పగిలిపోతూంటే, సాధారణంగా ప్రతి దినం తాగే చాయ్ ని ఇంట్లోనే తాగేయవచ్చు. చాయ్ లో శక్తి కలిగించే గుణం వుంది. ఒక్కసారి బ్రెయిన్ లోని నరాలన్నింటిని ఉత్తేజపరచి బద్ధకాన్నంతా వదల కొట్టేస్తుంది. ఇక మీ తలనొప్పి తక్షణం తగ్గాలంటే, ఆ చాయ్ మరుగుతున్నపుడు కొద్దిపాటి అల్లం, లవంగాలు, యాలకులు వేయండి. ఈ మిశ్రమం ఎంతటి నొప్పినైనా సరే పోగొడుతుంది. తలనొప్పికి కారణం విపరీతమైన ఒత్తిడి. అయితే, వెంటనే నూనెతో తలంతా మర్దన చేయండి. నూనె ఏదైనా హెర్బల్ నూనె అయ్యుండి కొద్దిపాటి వేడి చేసినదైతే చాలు. వెంటనే రిలీఫ్ కలుగుతుంది.

wonderful home remedy to remove hangover

రాత్రి పూట లిక్కర్ తీసుకుంటే పొద్దునే హేంగోవర్ హెడేక్ వచ్చిపడిందా? ఒక గ్లాసెడు వేడి నీరు తీసుకోండి. అందులో ఒక నిమ్మకాయ పిండండి. కొద్దిపాటి షుగర్ లేదా ఉప్పు వేయండి. బాగా కలపండి. కొద్ది కొద్దిగా తాగెయ్యండి. ప్రతి 4 లేదా 5 గంటలకు ఒక సారి తాగితే చాలు రెండు లేదా మూడు సార్లకు మీ హేంగోవర్ హెడేక్ గాయబ్ అవుతుంది. తలనొప్పులకు ఇంటిలో చేసుకునే చిట్కా వైద్యాలు వెంటనే పని చేయకపోవచ్చు. కాని దీర్ఘకాలంలో ఇవే ప్రయోజనకరం.

Admin