హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఈ నెల మొత్తం ఎంతో పవిత్రంగా భావిస్తూ నెల మొత్తం ఎంతో నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో శివకేశవులను పూజిస్తుంటారు. ఈ క్రమంలోనే కార్తీక మాసంలో శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతుంటాయి. ఎంతో పవిత్రంగా భావించే ఈ కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
అయితే కార్తీకమాసంలో పొరపాటున కూడా కొన్ని పనులను అసలు చేయకూడదు. ఈ మాసంలో కార్తీక దీపం వెలిగించే వారు పొరపాట్లను చేయరాదు.
కార్తీకమాసంలో కార్తీక దీపాలు వెలిగించే వారు కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడి కాయ వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
అలాగే శనగపప్పు, పెసరపప్పు, నువ్వులను తీసుకోకూడదు. ఆదివారం కొబ్బరి, ఉసిరికాయ తినరాదు. భోజన సమయంలో మౌనంగా ఉండాలి. మద్యం, మాంసం వంటి వాటిని కూడా తీసుకోకూడదు.
ఈ విధమైన నియమనిష్టలను పాటిస్తూ ఆ పరమేశ్వరుడికి పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.