sports

టెస్ట్ క్రికెట్ యుగం ముగిసిపోయిందా? టెస్టు క్రికెట్ అంటే ఫ్యాన్స్‌కు బోర్ కొట్టిందా..?

టెస్ట్ క్రికెట్ అభిమానులకు చూడడానికి కొంత బోర్ గా అనిపిస్తుంది కానీ ఆటగాడి ప్రకారం టెస్ట్ క్రికెటే అన్ని ఫార్మాట్లకంటే బెస్ట్ ఫార్మేట్ . దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 50, 20 ఓవర్ల ఆటలో ఒక బౌలరు కేవలం 20 శాతం ఓవర్ లే వేయగలడు కానీ టెస్ట్ క్రికెట్లో మొత్తము 50 శాతం ఓవర్ లు వేయగలడు. ఇతర ఫార్మేట్ లలాగా ఒక హద్దు అనేది ఉండదు బౌలర్ కి. మీ జట్టులో ఉన్న ఉత్తమ బౌలర్ చేత ఎన్ని ఓవర్లు అంటే అన్ని ఓవర్లు వేయించవచ్చు కానీ మిగతా ఫార్మాట్లలో అలా చేయడానికి అవకాశం ఉండదు కేవలం 20 శాతం ఓవర్ లే వేయించవచ్చు. 50 , 20 ఓవర్ల ఆటలలో 1–4 క్రమంలో వచ్చే బ్యాట్స్మెన్ లకే ఎక్కువ బంతులు ఆడే అవకాశం వస్తుంది కానీ దాని తర్వాత బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ బంతులు ఆడే అవకాశం దొరకదు.

టెస్ట్ క్రికెట్ లో అలా ఏముండదు 7 వై స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు కూడా సెంచరీలు కొట్టగలడు. 50 , 20 ఓవర్ల ఆటలలో ఫీల్డింగ్ నియమాలు ఉంటాయి. ఇంత‌ మందే ఇన్నర్ సర్కిల్ ,అవుటర్ సర్కిల్ లో ఉండాలి అని కానీ టెస్ట్ క్రికెట్లో అలా ఏమీ ఉండదు. మీకు ఇష్టం వచ్చిన మందిని ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు. టెస్ట్ క్రికెట్ లో కొన్ని కొన్ని సార్లు మంచి బౌలింగ్ వేసి అందరి బ్యాట్స్మెన్లను అవుట్ చేశాము అని సంబరపడితే బౌలర్లు సెంచరీ కొట్టి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు . అలాగే కొన్ని కొన్ని సార్లు బ్యాట్స్మన్ లు కూడా ఒక ఇన్నింగ్స్ లో 5 -6 వికెట్లు తీసుకుని మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. టెస్ట్ క్రికెట్ కి వయసుకి పెద్దగా సంబంధం ఉండదు. 30 ఏళ్ల తర్వాత కూడా అద్భుతంగా రాణించిన ఎందరో బౌలర్లు ఉన్నారు కానీ 20,50 ఓవర్ల ఆటలలో బౌలర్లకు 32–33 ఏళ్ళకే కెరీర్ ముగుస్తుంది. ఆ బౌలర్ల చోటికి కొత్త యువ బౌలర్ వస్తాడు కానీ టెస్ట్ క్రికెట్ లో 38- 39 వయసు వరకు కూడా బాగా ఆడిన ఆటగాళ్లు ఉన్నారు .

what is the best format of cricket

టెస్ట్ క్రికెట్ లో బంతి రివర్స్ స్వింగ్, స్పిన్ అవుతుంది. బంతి ఎంత పాతగా అయితే అంత ఎక్కువ రివర్స్ స్వింగ్, స్పిన్ అవుతుంది కానీ 20,50 ఓవర్ల ఆటలలో బంతి ఎక్కువ పాతగావద్దు కనుక బౌలర్ల కి టెస్ట్ క్రికెటే బెటర్ గా అనిపిస్తుంది. జనాలు 50,20 ఓవర్ లో ఎక్కువ ఎందుకు ఇష్టపడతారు అంటే అందులో సిక్సర్లు ఫోర్లు చాలా ఎక్కువగా కొడతారు కానీ టెస్ట్ క్రికెట్ లో అలా ఎంటర్టైనింగ్ గా ఉండదు అందుకే జనాలు 50,20 ఓవర్ ల ఆటలను ఎక్కువగా చూడటానికి ఇష్టపడతారు. ఒక టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్లు తీయాలి అలాగే పక్కన టీం కంటే ఎక్కువ రన్లు కూడా కొట్టాలి అదే 50, 20 ఓవర్ల ఆటలలో కేవలము రన్లు కొడితే చాలు తక్కువ వికెట్లు తీసిన పర్వాలేదు. 2006 వన్డే ఆటలో అత్యధిక run chase చేసిన సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా కంటే 5 వికెట్లు ఎక్కువ కోలిపోయింది 4 పరుగులు ఎక్కువ కొట్టింది అంటే 5 వికెట్లకంటే 4 పరుగులు ఎక్కువన్నమాట. ఈ విధముగా 50,20 ఓవర్ల ఆటలు కేవలము బ్యాట్స్మన్ కి అనుకూలంగా ఉంటుంది. దానికి తోడు ఫీలింగ్ నియమాలు, బౌలర్లు ఎన్ని ఓవర్లు వేయాలి అనే దాని మీద కూడా నియమం ఉంటుంది .

ప్రేక్షకుడికి టెస్ట్స్ట్ క్రికెట్ చూడటానికి బోరింగ్ గా అనిపించవచ్చు . అదే వన్ డే 20 – 20 ఆటలు ఎక్కువగా ఆసక్తికరంగా అనిపించవచ్చు కానీ ఒక ఆటగాడి ప్రకారంగా చూస్తే తన ప్రతిభ టెస్ట్ క్రికెట్ లోనే ఎక్కువగా చూపించడానికి అవకాశం ఉంటుంది మిగతా ఫార్మాట్లకంటే. మిగతా ఫార్మాట్లలో పైన చెప్పిన అన్ని కారణాలవల్ల టెస్ట్ క్రికెటే ఒక ఆటగాడి తన ప్రతిభను చూపించడానికి బెస్ట్. కాబట్టి టెస్ట్ క్రికెట్ యుగం అంతరించకూడదు , అంతరించదు కూడా.

Admin

Recent Posts