Categories: technology

TECNO POP 5 LTE : కేవ‌లం రూ.6వేల‌కే టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్‌.. భారీ బ్యాట‌రీ, డిస్‌ప్లే, మ‌రెన్నో ఫీచ‌ర్లు..

TECNO POP 5 LTE : టెక్నో సంస్థ కొత్త‌గా పాప్ 5 ఎల్‌టీఈ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. పాప్ 5 సిరీస్‌ను టెక్నో సంస్థ కొత్తగా ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ఫోన్‌లో అనేక అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇక ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం.

TECNO POP 5 LTE smart phone launched in india

టెక్నో పాప్ 5 ఎల్‌టీఈ స్మార్ట్ ఫోన్‌లో 6.52 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఎ25 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో ఈ ఫోన్ విడుద‌లైంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు.

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 గో ఎడిష‌న్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను అందిస్తున్నారు. వెనుక వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా.. ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు.

టెక్నో పాప్ 5 ఎల్‌టీఈ స్మార్ట్ ఫోన్ ఐస్ బ్లూ, డీప్ సీ ల‌స్ట‌ర్‌, టార్కాయిస్ క్యాన్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.6,299 గా ఉండ‌గా.. దీన్ని అమెజాన్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. జ‌న‌వ‌రి 16వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు.

Admin

Recent Posts