Categories: యోగా

Surya Mudra : సూర్యముద్రను రోజూ వేయండి.. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి..

Surya Mudra : ప్రాణాయామం అనేది యోగాలో ఒక ప్రక్రియ అన్న విషయం అందరికీ తెలిసిందే. యోగా వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ప్రాణాయామం వల్ల కూడా అన్నే లాభాలు ఉంటాయి. అయితే ప్రాణాయామం చేసేవారు పలు రకాల ముద్రలను చేతుల్తో వేస్తుంటారు.

do Surya Mudra daily for 10 minutes for these benefits

పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామం చేస్తూ అందులో భాగంగా పలు రకాల ముద్రలు వేస్తుంటారు. ఆ ముద్రల్లో సూర్య ముద్ర కూడా ఒకటి. దీన్ని వేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక సమస్యలు ఉన్నవారు సూర్య ముద్ర వేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఆయా సమస్యలన్నీ దూరమవుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

2. సూర్య ముద్ర వేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.

3. రోజూ నీరసం, నిస్సత్తువగా అనిపించేవారు, శక్తి లేనట్లు భావించేవారు, కొద్దిగా పనిచేయగానే అలసిపోయే వారు.. సూర్యముద్ర వేస్తే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. యాక్టివ్‌గా మారుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అలసిపోరు.

4. శరీరంలో వాపులు, నొప్పులు ఉన్నవారు సూర్య ముద్ర వేస్తే ఎంతో ఫలితం ఉంటుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.

5. మూత్రాశయ సమస్యలు ఉన్నవారు, మూత్రంలో ఇన్ఫెక్షన్‌ ఉన్నవారు, మూత్రం సరిగ్గా రాని వారు ఈ ముద్ర వేస్తే ఆ సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ లెవల్స్‌ తగ్గుతాయి. డయాబెటిస్‌ ఉన్నవారికి మేలు జరుగుతుంది. షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు.

6. సూర్య ముద్ర జీర్ణశక్తిని పెంచుతుంది. దీంతోపాటు శరీరంలోని కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

యోగా చేసేవారు రోజూ పద్మాసనంలో ఉండి 10 నిమిషాల పాటు రెండు చేతుల వేళ్లతో ఈ ముద్రను ఒకేసారి వేయాలి. ఇలా రోజూ చేస్తుంటే తప్పక ఫలితం ఉంటుంది.

Editor

Recent Posts