vastu

గులాబీ పువ్వుల రెక్కలతో ఇంట్లో ఇలా చేయండి.. సమస్యలన్నీ మటుమాయం అవుతాయి..!

సాధారణంగా మన ఇంట్లో కొన్నిసార్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ విధమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు మన ఇంట్లో అందరికీ ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ విధమైన కష్టాల నుంచి బయట పడటం కోసం వాస్తు పండితులు కొన్ని సూచనలను చెబుతున్నారు. మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవడానికి గులాబీ రేకులు చక్కటి పరిష్కార మార్గం అని పండితులు తెలియజేస్తున్నారు.

మన ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రతి రోజూ గులాబీ రేకులను ఒక గాజు గిన్నెలో తీసుకొని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆ గాజు పాత్రను ఉంచి అందులో నీళ్లు పోసి గులాబీ రేకులను వేయాలి. ఇలా చేయటం వల్ల గులాబీ రేకుల నుంచి వచ్చే తాజా శ్వాస ఇల్లు మొత్తం వ్యాపించి, మన ఇంట్లో ఉండే ప్రతికూల వాతావరణ పరిస్థితులను తొలగిస్తుంది.

do like this with rose petals to remove vastu dosham

ముఖ్యంగా ఈ విధంగా గులాబీ రేకులు ఉండే గిన్నెను తూర్పువైపు ఉండేటట్లు పెట్టడం వల్ల చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఇలా చేయటం వల్ల గులాబీ రేకుల నుంచి వచ్చే తాజా గాలి ఇంటిలో మొత్తం వ్యాపించి ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో అన్ని సమస్యలు పోతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు ఉండవు. సంపద కలసి వస్తుంది. అనారోగ్యాలు ఉండవు. అందరికీ శుభం జరిగి సంతోషంగా ఉంటారని పండితులు తెలియజేస్తున్నారు.

Admin

Recent Posts