vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో ఈ సూచ‌న‌లు పాటించండి.. లేదంటే అన్నీ న‌ష్టాలే వస్తాయి..

ఈ రోజుల్లో రిలేషన్ షిప్స్ ఎక్కడా కూడా ప్రశాంతంగా లేదు. మనస్పర్థలు, గొడవలు వస్తూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబసభ్యులతో బేధాభ్రిపాయాలు ఇలా.. అందరూ ఎదుటివారితో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. తప్పు ఎవరిలో అయినా ఉండొచ్చు.. కానీ ఇద్దరూ సఫర్ అవుతున్నారు. అయితే ఎప్పుడో ఒకసారి అంటే..పర్లేదు.. కానీ తరచూ ఇదే పంచాయతీ అయితే అసలు లైఫ్ మీద విరక్తి వచ్చేస్తుంది కదా..చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరుగుతున్నాయి అంటే.. దోషం ఇంట్లో కూడా ఉండొచ్చు. కొన్ని వాస్తు దోషాలు సంబంధాలమీద ప్రభావం చూపిస్తాయి. ఇంటి వాస్తు సరిగ్గా లేనప్పుడు మీరు ఎంత ఖర్చుపెట్టి ఇళ్లు కట్టుకున్నా ఉపయోగం ఉండదు. వాస్తుప్రకారం బెడ్‌రూమ్‌, కిచెన్‌, హాల్‌లో ఎలాంటి వస్తువులు ఉండాలో , ఎలాంటివి ఉండొద్దో ఈరోజు చూద్దాం.

భార్యాభర్తల పడకగదిలో అలంకరణ వస్తువులను జతగా ఉంచుకోవాలి. బెడ్‌రూమ్‌లో టీవీ, కంప్యూటర్లు‌ ఉండకూడదు. కానీ ఈరోజుల్లో చాలామంది ఇళ్లలో ఇవి ఉంటున్నాయి. వీటివల్ల… ప్రతికూల చర్యలు ఏర్పడుతాయి. బెడ్‌ని పడకగదిలో దక్షిణం లేదా నైరుతిలో ఉంచుకోవాలి. మంచం ఒకటే ఉండాలి. రెండు వేర్వేరు భాగాలు కలిపిన మంచం మంచిది కాదు. కానీ ఇది కూడా అందిరి ఇళ్లలో ఉంటుంది. రెండు బెడ్స్ కలిపి ఒకటిగా చేస్తుంటారు. వాస్తు ప్రకారం భార్య ఎప్పుడూ భర్తకు ఎడమవైపునకి పడుకోవాలి. దీంతో భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందట. మీ పడకగదిలో దేవతల చిత్రాలను ఉంచవద్దు అలాగే చనిపోయిన వ్యక్తుల చిత్రాలను కూడా పెట్టుకోకూడదు.

do these changes in your home for luck and wealth

వివాహం అయితే ఆగ్నేయ దిశలో ఉన్న గదిలో ఎప్పుడూ ఉండకూడదు. ఇది మీ సంబంధానికి అస్సలు మంచిది కాదు. పడకగదిలో లేత రంగులను ఉపయోగించాలి. అనవసరమైన వస్తువులతో గదిని నింపవద్దు. ఇలా చేస్తే గదిలో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంటి పెద్దవారి గది నైరుతి దిశలో ఉండాలే చూసుకోవాలి.. ఎందుకంటే బాధ్యతలు అన్ని వారే చూసుకుంటారు. కాబట్టి వారు నైరుతి దిశన ఉండాలి. మీరు పడుకునే మంచం చెక్కతో తయారుచేసి ఉండాలి. అది చతురస్రంగా ఉండాలి. నిద్రించేటప్పుడు, మీ తల దక్షిణం వైపు , పాదాలు ఉత్తరం వైపు ఉండాలి. తప్పుగా పడుకోవడం అసలే మంచిది కాదు.

Admin

Recent Posts