Items In Wallet : అదృష్టం.. జీవితంలో చాలా మంది ఇది కలసి రాదని బాధపడుతుంటారు. కేవలం కొందరికి మాత్రమే అదృష్టం కలసి వస్తుందని, తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందని అధిక శాతం మంది బాధపడుతుంటారు. తమ దురదృష్టానికి తమను తామే నిందించుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. అయితే అలాంటి వారు కింద ఇచ్చిన కొన్ని సూచనలు పాటిస్తే వారికి లక్ ఎప్పుడూ తోకలా వెన్నంటే ఉంటుందట. ఏది చేసినా కలసి వస్తుందట. మరికెందుకాలస్యం, లక్ కలసి రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి.
ఒక రావి ఆకును తెంపి దాన్ని శుభ్రంగా కడిగి మీ పర్స్ లేదా వాలెట్‌లో పెట్టుకోండి. దీంతో లక్ ఎప్పుడూ మీకు కలసి వస్తుంది. అంతేకాదు మీ చుట్టూ పాజిటివ్ శక్తి కూడా ఉంటుంది. దేవాలయాలకు వెళ్లినప్పుడు బియ్యం గింజలను లక్ష్మీ దేవికి ఇవ్వడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ఈ క్రమంలో మీ పర్సులో కొన్ని బియ్యం గింజలను ఎల్లప్పుడూ దగ్గర పెట్టుకున్నా అదృష్టం కలసి వస్తుంది. ఒక 20 రూపాయల నోటు, రెండు రూపాయి నోట్లు కలిపి వాటిని సిల్వర్ పేపర్‌లో చుట్టగా చుట్టి పర్సులో పెట్టుకోవాలి. దీంతో లక్ కలిసి వస్తుంది. అయితే అలా చుట్టిన డబ్బులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.
శేషతల్పంపై పడుకున్న విష్ణువు పాదాలను ఒత్తుతున్న లక్ష్మీ దేవి ఫొటోను దగ్గర పెట్టుకోవాలట. దీని వల్ల కూడా లక్ కలసి వచ్చి అనుకున్న పనులు త్వరగా జరుగుతాయట. తెల్లని గులక రాళ్లను పర్సులో పెట్టుకున్నా అదృష్టం కలసి వస్తుందట. పాజిటివ్ శక్తి పెరుగుతుందట. చిన్నపాటి కొబ్బరి కాయలతో ఇంట్లో పూజ చేసిన తరువాత వాటిని పగలకొట్టి ఆ ముక్కలను పర్సులో పెట్టుకోవాలి. ఇలా చేసినా పాజిటివ్ శక్తి పెరుగుతుంది. పసుపు రంగులో చిన్నగా ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలని పిలుస్తారు. వీటిని దగ్గర పెట్టుకున్నా లక్ కలసి వస్తుంది. అనుకున్న పని జరుగుతుంది.
తామర పువ్వు విత్తనాలను దగ్గర పెట్టుకుంటే మానసికంగా ఆరోగ్యం కలుగుతుంది. అదృష్టం కూడా కలసి వస్తుంది. మంత్రించిన శ్రీయంత్రాన్ని పర్సులో పెట్టుకుంటే ధనం బాగా సమకూరుతుంది. అదృష్టం కూడా బాగా వస్తుంది. గోమతి చక్ర అని పిలవబడే ప్రత్యేకమైన శంకులను దగ్గర పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. లక్ కూడా కలసి వస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది.