viral news

మూత్రంతో రొట్టెలు చేసి ఇంటి వాళ్ల‌కు పెడుతున్న ప‌నిమ‌నిషి.. వీడియో వైర‌ల్‌..

ఘజియాబాద్ కి చెందిన ఒక కుటుంబం మొత్తం లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. దానికి సంబందించిన గల కారణాలు తెలుసుకోడానికి ప్రయత్నించగా ఇలా తేలింది. ఘజియాబాద్ లో ఒక పని మనిషి రోటీలను తయారు చేయడానికి యూరిన్ ఉపయోగిస్తోంది. ఇది ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతోంది అని ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఘజియాబాద్ కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యక్తి ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుండి ఒక మహిళా వంట మనిషిగా పని చేస్తోంది. అయితే ఈమె ప్రతి రోజు రోటీలను తయారు చేసేటప్పుడు పిండి కలపడానికి తన యూరిన్ ని ఉపయోగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

maid using her urine to make rotis video viral

ఈ వీడియో ను చుసిన నెటిజెన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు అయితే ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతాయా అని అంటున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు అందరూ లివర్ కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు అని తేలింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Peddinti Sravya

Recent Posts