vastu

Wealth : ఈ రోజు ఈ కొమ్మను తెచ్చి బీరువాలో పెడితే.. డబ్బులు వస్తూనే ఉంటాయి..!

Wealth : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో దానిమ్మ చెట్లు ఎక్క‌డ చూసినా పెరుగుతుంటాయి. ఇవి ఎలాంటి నేల‌లో అయినా స‌రే సుల‌భంగా పెరుగుతాయి. వీటిని పెంచేందుకు పెద్ద‌గా నీళ్లు కూడా అవ‌స‌రం లేదు. దానిమ్మ పండ్ల‌ను తింటే మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే దానిమ్మ చెట్టు కొమ్మ‌ల‌కు ఆధ్యాత్మికంగా ఎంతో విలువ ఉంది. అనేక యంత్రాల‌ను వీటితోనే రాస్తారు. క‌నుక దానిమ్మ కొమ్మ‌లు మ‌న‌కు అదృష్టాన్ని, సంప‌ద‌ను తెచ్చి పెడ‌తాయ‌ని పండితులు చెబుతున్నారు. క‌నుక ఈ కొమ్మ‌ల‌ను ఎలా ఉప‌యోగిస్తే మ‌న‌కు మేలు జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ చెట్టులో సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవి కొలువై ఉంటుంద‌ట‌. క‌నుక ఈ చెట్టు కొమ్మ‌ల‌ను తెంచే ముందు చెట్టుకు ఒక సారి న‌మ‌స్కారం చేయాలి. ఆ ల‌క్ష్మీదేవిని క్ష‌మించ‌ని కోరాలి. త‌రువాత కొమ్మ‌ల‌ను తెంచాలి. తెంచేట‌ప్పుడు ఆ కొమ్మ‌ల‌ను ఏ ప‌ని కోసం ఉప‌యోగించ‌బోతున్నామో చెప్పాలి. ఇక ఈ కొమ్మ‌ల‌ను ఫ‌ల్గుణి న‌క్ష‌త్రం రోజున తెంచి ఎర్ర‌ని వ‌స్త్రంలో చుట్టాలి. అనంత‌రం పూజ గ‌దిలో ఉంచి పూజ‌లు చేయాలి. త‌రువాత కొమ్మ‌లు ఉన్న ఆ వ‌స్త్రాన్ని అలాగే బీరువాలో పెట్టాలి. దాని ద‌గ్గ‌ర ఇత‌ర ఏ వ‌స్తువుల‌ను కూడా ఉంచ‌రాదు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. ధ‌నం బాగా సంపాదిస్తారు. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి. వ్యాపారంలో లాభాలు వ‌స్తాయి.

put pomegranate branch in beeruva to attract wealth

ఇక శ‌నివారం రోజు స్వాతి న‌క్ష‌త్రం వ‌చ్చిన రోజు ఈ కొమ్మ‌ల‌ను తెంచి వాటిని బియ్యంతో క‌లిపి పూజ చేసి అనంత‌రం వాటికి న‌ల్ల‌దారం క‌ట్టి మ‌న శ‌రీరానికి క‌ట్టుకోవాలి. ఇలా చేస్తే దుష్ట‌శ‌క్తుల పీడ ఉండ‌దు. అలాగే దిష్టి కూడా పోతుంది. మ‌న‌పై ఉండే చెడు ప్ర‌భావం అంతా త‌గ్గుతుంది. ఆరోగ్యం క‌లుగుతుంది. ఏవైనా దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటే నెమ్మ‌దిగా త‌గ్గుతాయి. అలాగే మ‌నపై ఉండే దోషాలు కూడా పోతాయి.

ఇక గురువారం రోజు ఈ కొమ్మ‌ల‌ను తెంచి ప‌సుపు రంగు వ‌స్త్రంలో చుట్టి, ప‌సుపు రంగు తీపి వంట‌కం చేసి పూజ చేయాలి. త‌రువాత ఆ వ‌స్త్రాన్ని విద్యార్థుల బ్యాగులు లేదా పుస్త‌కాల్లో ఉంచాలి. దీంతో వారు చ‌దువుల్లో రాణిస్తారు. ఏకాగ్ర‌త పెరుగుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, తెలివితేటలు వ‌స్తాయి. ఇలా దానిమ్మ కొమ్మ‌ల‌ను ఉప‌యోగించి మ‌నం లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts