ఇల్లు లేదా స్థలం తీసుకున్నప్పుడు దానికి వాస్తు తప్పనిసరిగా చూసుకుంటారు శాస్త్ర నిపుణులు. 8 దిక్కులకు ఎనిమిది దేవుళ్లు అధిపతులు అందుకే ఒక్కో దిక్కున ఒక్కో విధమైన జాగ్రత్తలు తీసుకుంటాం. ఏ దిక్కున ఏ వస్తువులు ఉండటం వల్ల అవి మనకు మంచి లేదా చెడును చేస్తాయి అని తెలుసుకొని వ్యవహరిస్తుంటాం. ఏ స్థలానికి అయినా నాలుగు దిక్కులు సమానంగా ఉండాలి. ఒకవేళ తూర్పు ఆగ్నేయంలో వీధిశూల ఉంటే అది చాలా ప్రమాదం. దీనివల్ల అగ్ని ప్రమాదాలు, స్త్రీలకు ఆరోగ్య సమస్యలకు ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్లకైతే దిక్కుల ఎత్తులను సరిగా చూసుకోవాలి.ఆగ్నేయంలో వాస్తు దోషం ఉంటే సర్వ నాశనమే ఆగ్నేయంలో నైరుతి కంటే ఎత్తు పెరిగినా, గోతులున్నా, ద్వారం ఉన్నా దోషమే అంటున్నారు.
తూర్పు వీధి దక్షిణం వీధి గల గృహము ఆగ్నేయ గృహం అంటారు. ఆగ్నేయ గృహంలో నివసించేవారికి సత్ఫలితాల కంటే దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మిగతా అన్ని గృహాల కంటే ఆగ్నేయ గృహం తక్కువ వాస్తు బలాన్ని కలిగి ఉంటుందని చెబుతారు. ఆగ్నేయం మూలన ఎక్కువగా వంటగదికి కేటాయిస్తారు. అదేవిధంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కేవలం ఆగ్నేయం, వాయువ్యం తప్ప ఇతర ఏ మూలలో కూడా పెట్టుకోకూడదు. ఈ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ వల్ల రెండు దోషాలు వస్తాయి. ఒకటి ఆ ఇంట్లో ఉన్న వారికి ఆపరేషన్స్ అవ్వడం లేదా ఆ ఇంటిని విక్రయించే పరిస్థితులు రావడం జరుగుతుంది. అందుకే కేవలం ఆగ్నేయంలోనే వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేసుకోవడం మేలు. టాయిలేట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు.
ఆగ్నేయ ప్రాంతం వైపు నీలం రంగు ఉండకుండా చూసుకోవాలి. ఈ దిశలో లేత నారింజ, గులాబీ రంగులను ఉపయోగించండి. ఇంటిలోపల ఉండే స్పైడర్ వీల్స్, దుమ్ము, ధూళిని ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ నిలవదు. వాస్తు ప్రకారం, ఆగ్నేయ కోణంలో పడకగది ఉండటం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు మరియు కోపం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ కోణంలో పడకగది ఉండటం వల్ల వ్యక్తిగత సంబంధాలలో టెన్షన్ మరియు గొడవలు పెరుగుతాయి. ఆగ్నేయ కోణంలో పడకగది ఉండటం వల్ల ఆర్థికంగా నష్టపోవచ్చు. ఆగ్నేయంలో వాస్తు దోషం ఉంటే చిన్నచిన్న వ్యవహారాలు సైతం, పెద్ద ఘర్షణలు గా మారి రక్తపాతం కూడా జరుగుతుందని సూచించబడింది.