vastu

Handkerchief : హ్యాండ్ కర్చీఫ్ ను వాడితే.. వాస్తు ప‌రంగా ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Handkerchief : హ్యాండ్ క‌ర్చీఫ్‌ల‌ను మీరు ఎల్ల‌ప్పుడూ వెంట ఉంచుకుంటారా..? లేదా..? అయితే ఇప్పుడే ఓ హ్యాండ్ క‌ర్చీఫ్‌ను కొని వెంట పెట్టుకోండి. అంటే, కేవ‌లం శుభ్ర‌త కోస‌మే కాదు, హ్యాండ్ క‌ర్చీఫ్ ద‌గ్గ‌ర ఉండ‌డం వ‌ల్ల మీలో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ పోయి అంతా పాజిటివ్ ఎన‌ర్జీయే వ‌స్తుంద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే..! ఈ క్ర‌మంలో ఎలాంటి హ్యాండ్ క‌ర్చీఫ్ ఉండాలో, దాని వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కాట‌న్, సిల్క్‌తో త‌యారు చేసిన హ్యాండ్ క‌ర్చీఫ్ వాడితే మంచిది. ఇది మీలో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీని పీల్చుకుని పాజిటివ్ ఎన‌ర్జీని ఇస్తుంది. అయితే క‌ర్చీఫ్‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవ‌డం ముఖ్యం లేదంటే మీలో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ అలాగే ఉంటుంది. తెలుపు రంగులో ఉన్న హ్యాండ్ క‌ర్చీఫ్‌ను ద‌గ్గ‌ర పెట్టుకుంటే మీలోకి ఎల్ల‌ప్పుడూ పాజిటివ్ వైబ్రేష‌న్స్ వెళ్తుంటాయి. దీంతో అంతా శుభ‌మే జ‌రుగుతుంది. చంద్రుడి శుభ‌దృష్టి మీపై ప‌డుతుంది. మీరు ఎల్ల‌ప్పుడూ ప్ర‌శాంతంగా ఉంటారు.

vastu benefits for using hand kerchief

మీ హ్యాండ్ క‌ర్చీఫ్‌ ఎల్ల‌ప్పుడూ మీరే వాడాలి. వేరే ఎవ‌రికీ ఇవ్వ‌కూడ‌దు. అలాగే ఇత‌రుల క‌ర్చీఫ్‌లు తీసుకోకూడ‌దు. ఎందుకంటే వారి క‌ర్చీఫ్‌లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ మీలోకి ప్ర‌వేశిస్తుంది. మీరు దేని గురించైనా మ‌రిచిపోయిన‌ప్పుడు మీ హ్యాండ్ క‌ర్చీఫ్‌ను ముడి వేసి పెట్టి అలాగే వ‌దిలేయండి. అది మీరు మ‌రిచిపోయిన దాన్ని త్వ‌ర‌గా గుర్తించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. లాల్ కితాబ్ అస్ట్రాల‌జీ ప్ర‌కారం ఇది సాధ్య‌మ‌వుతుంద‌ట‌. మీ హ్యాండ్ క‌ర్చీఫ్‌ల‌పై పెన్నులు, పెన్సిల్స్, స్కెచ్‌ల వంటి వాటితో రాయ‌కూడ‌దు. అలా చేస్తే.. మీలో ఉన్న ఏకాగ్ర‌త, ప‌ట్టుద‌ల పోతాయ‌ట‌.

డార్క్ రంగులో ఉన్న హ్యాండ్ క‌ర్చీఫ్‌ల‌ను వాడ‌కూడ‌దు. ఎల్ల‌ప్పుడూ లైట్ క‌ల‌ర్స్‌తో త‌యారు చేసిన హ్యాండ్ క‌ర్చీఫ్‌ల‌నే వాడాలి. ఎందుకంటే డార్క్ క‌ల‌ర్స్ రాహువు, కేతువు, శ‌ని, కుజుడు వంటి గ్ర‌హాల‌ను ప్ర‌తిబింబిస్తాయ‌ట‌. వాటితో మ‌న‌కు చాలా హాని జ‌రుగుతుంద‌ట‌. క‌నుక హ్యాండ్ క‌ర్చీఫ్‌ల‌ను వాడ‌డంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటే.. లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts