Buddha : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఎక్కడ చూసినా తమ ఇళ్లు లేదా ఆఫీసుల్లో గౌతమ బుద్ధుని విగ్రహాలను లేదా చిత్ర పటాలను పెట్టుకుంటున్నారు. గౌతమ బుద్ధుడు ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ తెలిసిందే. బౌద్ధ మతాన్ని అనుసరించేవారు చాలా మందే ఉన్నారు. అయితే చాలా మంది ఇతర మతాలకు చెందిన వారు కూడా బుద్ధుని విగ్రహాలను, చిత్రపటాలను ఇళ్లలో పెట్టుకుంటున్నారు. అయితే అసలు బుద్ధుని ఫొటోలు, విగ్రహాలను ఇళ్లు లేదా ఆఫీసుల్లో ఎందుకు పెట్టుకోవాలి. దీని వల్ల ఏం జరుగుతుంది..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం చాలా మంది ఇళ్లను కట్టుకునేవారు లేదా అద్దెలకు ఉండేవారు ఎవరైనా సరే వాస్తు ప్రకారం పనులు చేస్తున్నారు. ఎందుకంటే వాస్తు దోషంతో ఇంటిని నిర్మించినా.. అలాంటి దోషం ఉన్న ఇంట్లో ఉన్నా.. ఆ ఇంట్లోని వారందరికీ సమస్యలే వస్తాయి. కనుక వాస్తు అన్నది ప్రధానంగా భావిస్తున్నారు. అయితే వాస్తు ప్రకారం గౌతమ బుద్ధుని విగ్రహం లేదా చిత్ర పటం అన్నది మనకు ఎంతగానో మేలు చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గౌతమ బుద్ధుడు సహనానికి మారు పేరు. అలాగే ప్రశాంతంగా కనిపిస్తాడు. చిరునవ్వుతో ఉంటాడు. కనుక ఆయన విగ్రహం లేదా చిత్ర పటాన్ని ఇంట్లో పెట్టుకుంటే దాంతో ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవనం సాగిస్తారని వాస్తు శాస్త్రం చెబుతోంది. కనుకనే ఆయన ఫొటోలు లేదా విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సైతం చెబుతుంటారు.
ఇక బుద్ధుని విగ్రహాలు ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది. నెగెటివ్ ఎనర్జీ పోతుంది. వాస్తు దోషాలు తొలగిపోతాయి. దీంతో ఇంట్లోని వారందరికీ ఎలాంటి సమస్యలు ఉండవు. కనుక గౌతమ బుద్ధుని ఫొటోలు లేదా విగ్రహాలను ఇంట్లో కనీసం ఒక్కటి అయినా సరే పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక బుద్ధుని ఫొటోను ఇంట్లో అందరూ తిరిగే చోట ఉంచడం మంచిది. లేదా తూర్పు వైపు ముఖం చూసేలా కూడా పెట్టవచ్చు. ఈశాన్యం మూలన పెడితే ఇంకా మంచిది. అలాగే చిన్నారుల గదుల్లో పెడితే వారు సౌమ్యంగా ఉంటారు. కోపం తగ్గుతుంది. చదువుల్లో రాణిస్తారు. ఈ విధంగా గౌతమ బుద్ధుని ఫొటోలు లేదా విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.