ఈమధ్య కాలంలో సోషల్ మీడియా పిచ్చితో కొందరు చేయకూడని పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైకులు తెచ్చుకుని ఫాలోవర్లను పెంచుకునేందుకు సాహసాలు చేస్తున్నారు. కొండప్రాంతాల్లో అంచున నిలబడి లేదంటే డ్యామ్‌లు, రిజర్వాయర్లు, వాటర్ ఫాల్స్ అంచున నిలబడి రీల్స్ చేస్తున్నారు. దీంతో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
ఇక కొందరు అయితే రీల్స్ పిచ్చితో పబ్లిక్ లో పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. వీరి ప్రవర్తన కారణంగా ప్రజలకు ఎంతో ఇబ్బంది కలుగుతోంది. తాజాగా ఢిల్లీ మెట్రోలో కొందరికి కూడా ఇలాగే జరిగింది. మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో సహేలి రుద్ర అనే యువతి ఓ బాలీవుడ్ సాంగ్‌కు చిందులేసింది.
అయితే ఆమె ఆ రీల్ చేస్తున్న సమయంలో చుట్టూ ఉన్నవారు చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. చాలా మంది నెటిజన్లు కూడా ఆమెపై నెగెటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. పబ్లిక్‌లో ఇలా రీల్స్ చేస్తూ పిచ్చిగా ప్రవర్తించే వాళ్లను విడిచిపెట్టకూడదని, పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. అయితే ఆమె వీడియో మాత్రం పాపులర్ అవడం విశేషం. బహుశా ఇందుకే కాబోలు, ఆమె ఆ విధంగా డ్యాన్స్ చేసింది. ఏది ఏమైనా ఇలా చేసినందుకు గాను ఆమెకు బాగా ఫాలోవర్స్ పెరిగే ఉంటారని అనుకోవచ్చు.