Jaggery With Milk : పాలు మన శరీరానికి సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయి. మన శరీరానికి కావల్సిన కీలక విటమిన్లను అందజేస్తాయి. బెల్లంను చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడతారు. దీంతో అనేక పిండి వంటలు చేసుకుంటారు. సాధారణ చక్కెర కన్నా బెల్లం తినడం వల్లే మనకు ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అయితే వేడి వేడి పాలలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగితే ఎలా ఉంటుంది..? టేస్ట్ అదిరిపోతుంది కదా..! కొందరు పాలు ఇలాగే తాగుతారు. అయితే ఇలా పాలలో బెల్లం కలుపుకుని తాగితే కేవలం రుచి అందడం మాత్రమే కాదు, మనకు కలిగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. ఈ క్రమంలో అలా తాగడం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి వేడి పాలలో బెల్లం కలుపుకుని తాగితే అధిక బరువు తగ్గుతారు. బెల్లం, పాలలో ఉండే పలు రకాల ఔషధ గుణాలు శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గిస్తాయి. తద్వారా బరువు తగ్గుతారు. నిత్యం తాగడం వల్ల వెయిట్ అదుపులో ఉంటుంది. నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్య రక్త హీనత. అనీమియా. దీని వల్ల శరీరంలో రక్తం సరిగ్గా ఉండదు. ఫలితంగా ఆరోగ్యం చెడిపోతుంది. పోషకాలు అందవు. అయితే బెల్లం కలిపిన పాలు తాగుతుంటే రక్త హీనత సమస్య ఇట్టే పోతుంది. రక్తం బాగా పడుతుంది. ప్రధానంగా మహిళలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
బెల్లం కలిపిన వేడి పాలను తాగడం వల్ల వాటిలో ఉండే పోషకాలు అంది జుట్టు కాంతివంతంగా మారుతుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. చుండ్రు పోతుంది. రుతు సమయంలో మహిళలకు వచ్చే వివిధ రకాల సమస్యలు, ప్రధానంగా కడుపునొప్పి తగ్గుతుంది. బెల్లం కలిపిన వేడి పాలలో సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల అవి అనారోగ్యాలను కలిగించే వైరస్‌లు, బాక్టీరియాల భరతం పడతాయి. దీంతో పలు ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వృద్ధాప్యంలో చాలా మందికి కీళ్ల నొప్పులు వస్తుంటాయి. అయితే అలాంటి వారు రోజూ వేడి పాలలో బెల్లం కలుపుకుని తాగితే దాంతో ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు కీళ్లు దృఢంగా మారుతాయి.
బెల్లం కలిపిన వేడి పాలను తాగుతుంటే దాంతో జీర్ణ సమస్యలు దూరమవుతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్ణం వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. బెల్లం, పాలలో అద్భుతమైన పోషకాలు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి కచ్చితంగా ప్రతి రోజూ వీటి కాంబినేషన్ తీసుకుంటే మంచిదని అధ్యయనాలు నిరూపించాయి. ప్రతిరోజూ తీసుకుంటే కచ్చితంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చు.