వృషణాల క్యాన్సర్… ఇంగ్లిష్‌లో దీన్నే Testicular Cancer అని కూడా అంటారు. పురుషులకు ఉండే వృషణాల్లో ఇది వస్తుంది. 15 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారికి ఇది ఎక్కువగా వస్తుంది. అయితే అన్ని రకాల క్యాన్సర్లలా ఇది కాదు. ఎందుకంటే దీన్ని ఆరంభంలోనే గుర్తిస్తే 90 శాతం వరకు వెంటనే నయం చేయవచ్చు. వృషణాల క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతకు ముందు కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఈ వ్యాధి వారి తరువాతి తరాల వారికి రావచ్చు. లేదంటే కిడ్నీలు, మూత్రాశయ సమస్యలు వంటి పలు ఇతర కారణాల వల్ల కూడా ఇది వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
వృషణాల క్యాన్సర్ వచ్చిన వారికి ఆ భాగంలో నొప్పి ఉంటుంది. దీంతోపాటు పొత్తి కడుపు కింది భాగంలో నొప్పి ఉండవచ్చు. ఆయాసం, దగ్గు, కడుపునొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా ఈ వ్యాధి సోకిన వారిలో ఉంటాయి. అయితే ఎవరికైనా వృషణాల క్యాన్సర్ వచ్చిందని తెలుసుకునేందుకు చాలా సింపుల్ మార్గం ఉంది. హాస్పిటల్‌కు వెళ్లి వేలకు వేలు పెట్టి టెస్టులు చేయించుకోవాల్సిన పనిలేదు. కేవలం రూ.50 ఖర్చు చేస్తే చాలు, ఆ వ్యాధి ఉందా, లేదా అని తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే… మహిళలు గర్భం వచ్చిందో, రాలేదో తెలుసుకునేందుకు ఉపయోగపడే ప్రెగ్నెన్సీ కిట్ వల్ల. అవును, మీరు విన్నది నిజమే. ఇది నిరూపించబడింది కూడా. ఎలాగో తెలుసా..?
ఓ వ్యక్తి బాత్‌రూంలో పడి ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెన్సీ కిట్ తెరిచాడు. అందులో స్ట్రిప్ ఉంది. సాధారణంగా మహిళలు అయితే తమ మూత్రం కలెక్ట్ చేసి 1, 2 డ్రాప్స్ అందులో వేస్తే ప్రెగ్నెన్సీ ఉందో, లేదో తెలుస్తుంది. అందుకు గాను సదరు స్ట్రిప్‌పై గీతలు పడతాయి. ప్రెగ్నెంట్ అయితే రెండు ఎర్రని గీతలు కనిపిస్తాయి. కాకపోతే ఒకటే ఎర్రని గీత దర్శనమిస్తుంది. దీంతో క్యాజువల్‌గానే ఆ యువకుడు తన మూత్రం 1, 2 డ్రాప్స్‌ను ఆ స్ట్రిప్‌పై పోశాడు. దీంతో రెండు ఎర్రని గీతలు కనిపించాయి. అది చూసిన అతను ఒక్కసారిగా షాక్ తిన్నాడు. తాను ప్రెగ్నెంట్ అవడం ఏంటని కంగారు పడ్డాడు. ఈ విషయాన్ని వివరిస్తూ రెడ్డిట్ (Reddit) అనే ఓ సోషల్ సైట్‌లో పోస్ట్ చేశాడు. దీంతో అతని స్నేహితుడు ఒకరు ఓ సలహా ఇచ్చారు. అదేమిటంటే…
ప్రెగ్నెన్సీ కిట్‌లో రెండు ఎర్రని గీతలు కనిపించినంత మాత్రాన గర్భం వచ్చినట్టు కాదని, అందుకు మరో కారణం ఉందని, అది వృషణాల క్యాన్సర్ కావచ్చని తెలిపాడు. దీంతో ఆ యువకుడు వృషణాల క్యాన్సర్ టెస్టులు చేయించుకుంటే అవి పాజిటివ్ అని వచ్చాయి. దీంతో అతను మరోసారి షాక్ తిన్నాడు. అయితే అది ఆరంభంలోనే ఉందట. క్యూర్ చేయవచ్చని వైద్యులు చెప్పడంతో అతను శాంతించాడు. ఇప్పుడు చెప్పిన సంఘటన నిజంగా జరిగిందే. దాన్ని బట్టే మహిళలు ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ఉపయోగించే కిట్ల ద్వారా పురుషులు వృషణాల క్యాన్సర్ వచ్చిందా, రాదా అన్న విషయం తెలుసుకోవచ్చని చెప్పింది.
అయితే ఇది ఎలా సాధ్యమవుతుందంటే గర్భం దాల్చిన స్త్రీలలో Human Chorionic Gonadotropin (HCG) అనే ఓ హార్మోన్ విడుదలవుతుంది. దీన్ని గుర్తించే ఆ టెస్ట్ స్ట్రిప్ ప్రెగ్నెన్సీ వచ్చిందో రాదో చెబుతుంది. అయితే ఇదే హార్మోన్ వృషణాల క్యాన్సర్ వచ్చిన వారిలోనూ ఉత్పత్తి అవుతుందట. అందుకే మరి, ప్రెగ్నెన్సీ కిట్‌లో ఆ వ్యక్తి మూత్రం పోసినప్పుడు అలా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇక ఈ కిట్ ధరెంతో తెలుసా..? చాలా వరకు కంపెనీలు కేవలం రూ.50 కే ఒక స్ట్రిప్‌ను విక్రయిస్తున్నాయి. కనుక ఎవరైనా ఈ టెస్ట్ ను సేఫ్‌గా చేసుకోవచ్చు..!