సాధారణ బరువు ఉన్నంత వరకు ఓకే. కానీ ఒకసారి బరువు పెరుగుతున్నాం అని తెలిస్తే, వెంటనే తగ్గించుకోవాలి. లేదంటే అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఇక ఒక్కసారిగా బరువు పెరిగితే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. ఈ క్రమంలో చాలా మంది సర్జరీల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే ఇలాంటి వారిలో సర్జరీలు ఫెయిలై మృతి చెందిన వారే ఎక్కువ. ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణ కూడా అధిక బరువు తగ్గించుకునే క్రమంలో చేయించుకున్న సర్జరీల వల్లే మరణించారట. ఆయన కుమార్తె హేమాలయ ఈ విషయాలను వెల్లడించారు.
దాసరి నారాయణరావుకు మధుమేహం తప్ప మరే దీర్ఖకాలిక వ్యాధీ లేదట. అయితే అధిక బరువు ఉన్న కారణంగా అది తగ్గించుకుంటే మంచిదని డాక్టర్లు సలహా ఇచ్చారట. దీంతో ఆయన 75 ఏళ్ల వయస్సులో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే సర్జరీ వద్దని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతర డాక్టర్లు చెప్పారట. అయినప్పటికీ ఆయన వినకుండా సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమయ్యారట. ఈ క్రమంలోనే ఆపరేషన్ అత్యంత క్లిష్టతరంగా అయిందట. ఆయన శరీరంలోని కొవ్వును తీస్తూ డాక్టర్లు సర్జరీలు చేశారట. అయితే అలా సర్జరీలు చేసే క్రమంలోనే దాసరి అన్న వాహికకు గాయం అయిందట.
అయినప్పటికీ ఆ గాయాల మానాయి కానీ మళ్లీ అలాంటి సర్జరీలను రెండో సారి చేయించుకోవాలని ఆయన పట్టుబట్టారట. దీంతో మరోసారి దాసరి సర్జీరలకు సిద్ధమయ్యారు. అయితే మొదటి సారి ఆయనకు సర్జరీ చేసిన డాక్టర్ లేకపోవడంతో వేరే డాక్టర్ పర్యవేక్షణలో ఆ సర్జరీలు చేయించుకున్నారు. అయితే ఈ సారి మాత్రం ఏదో తేడా జరిగిందట. ఆపరేషన్ అయి డిశ్చార్జితో ఇంటికొచ్చాక కండిషన్ సీరియస్ అయిందట. దీంతో ఆస్పత్రికి వెళ్లగా సర్జరీ ఫెయిలయినట్టు వైద్యులు నిర్దారించారు. దాసరి అన్నవాహికకు మరోసారి రంధ్రం పడిందని, దీంతో ఊపిరితిత్తుల్లో బాగా నీరు చేరిందని చెప్పారు. ఆ తరువాత ఇక ఆయన కండిషన్ మరింత సీరియస్ అయింది. అయితే మళ్లీ సర్జరీలు చేయడంతో చివరికి ఎలాగో బయటపడి ఇంటికొచ్చారు.
ఈ క్రమంలో అప్పటి నుంచి పొట్ట దగ్గర ట్యూబు ద్వారా ద్రవాహారం తీసుకుంటూ కొద్దిగా కోలుకుంటూ వచ్చారు. అయితే మామూలుగా నోటి ద్వారా తినేలా అన్నవాహికను పునర్నిర్మించేందుకు ఇంకో సర్జరీ చేయించుకోవాలనుకున్నారు. దాని కోసమే మళ్లీ ఆసుపత్రిలో చేరారు. అప్పుడు పెద్ద పేగును కట్ చేసి కృత్రిమంగా అన్నవాహికను నిర్మించే సర్జరీ చేశారు. తీరా అది కూడా ఫెయిలైంది. దీంతో అవయవాలు ఒక్కొక్కటి పని చేయడం మానేశాయి. జరగరానిది జరిగిపోయింది. దాసరి కన్నుమూశారు. అలా ఆయన బరువు తగ్గడం కోసం చేయించుకున్న సర్జరీలు ప్రాణాలనే తీశాయి. చూశారుగా… కనుక ఇప్పటికీ ఎవరైనా ఇలాంటి సర్జరీల వైపు మొగ్గు చూపుతుంటే ఆ ప్రయత్నం మానుకోవడం బెటర్. లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది. ఆ తరువాత చేసేదేం ఉండదు.