యోగా

పద్మాసనం ఎలా వేయాలి? ఉపయోగాలు తెలుసా..?

మనకు తెలియని ఆసనాలు చాలా ఉన్నాయి. అలా అని అందరికీ తెలిసిన పద్మాసనం ఎలా వేయాలో, దాని ఉపయోగం గురించి తెలియదు. నచ్చిన విధంగా కూర్చొని ఇదే పద్మాసనం అనేవాళ్లు చాలామంది ఉన్నారు. తెలియని వారికి తెలియజేస్తూ వాటి ఉపయోగాలను గురించి చర్చించుకుందాం.. ఆసనాల్లో అన్నింటికన్నా పద్మాసనం మిన్న. అతి ముఖ్యమైనది కూడా. ఇది ఎంతో ప్రయోజనకరమైన ఆసనం అంటున్నారు యోగా గురువులు.

పద్మాసనం ఎలా వేయాలి?

ఈ ఆసనం ఎలా వేయాలంటే.. రెండు కాళ్లను ముందుకు చాచి దండాసనంలో కూర్చోవాలి. కుడికాలికి మోకాలు వద్ద ఉంచి రెండు చేతులతో పాదము తీసుకొని ఎడమ తొడ మొదలయందు కుడి మడమ బొడ్డు దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి. ఎడమ కాలిని మోకాలు వద్ద ఉంచి రెండు చేతులతో పాదములు తీసుకొని కుడి తొడ మొదలు యందు ఎడమ మడమ బొడ్డు దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి. కింద నుంచి మెడ వరకు వెన్నెముక నిటారుగా ఉంచాలి. రెండు చేతులను చాచి ఎడమ చేయి ఎడమ మోకాలి వద్ద కుడిచేయి కుడి మోకాలి వద్ద ఉంచాలి. బొటనవేళ్లను కలిపి మిగిలిన మూడు వేళ్లను చాచి ఉంచాలి. లేకుంటే ఒక అరచేయి మీదుగా ఇంకో అరచేయిని రెండు పాదములు ఒక దానిని ఒకటి కలిపిన దగ్గర ఉంచుకోవచ్చు. కాళ్ల స్థితిని మార్చి అంటే ఎడమ పాదమును కుడితొడ మీద, కుడిపాదమును ఎడమతొడ మీద వచ్చేలా చేయాలి. రెండు కాళ్లు సమానంగా పెట్టాలి.

how to do padmasanam and what are its benefits

కింద కూర్చోవడం అలవాటు లేనివారికి ఈ ఆసనం వేసేటప్పుడు విపరీతమైన నొప్పి మోకాళ్ల వద్ద కలుగుతుందని యోగా గురువులు చెబుతున్నారు. కానీ నొప్పికి తట్టుకొని శ్రద్ధగా సాధన చేసిన నొప్పి క్రమంగా తగ్గిపోయి హాయిగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. మొదట మోకాళ్ళనొప్పులు తగ్గిపోతాయట. మనస్సు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఉత్సాహం ఇస్తుంది. జీర్ణవ్యవస్థ, ఉదర భాగంలోని అవయవాలన్నీ బాగా పనిచేస్తాయంటున్నారు యోగా గురువులు.

ఉపయోగాలు :

ఈ ఆసనం ప్రాణాయామం, ధ్యానం చేయుటకు చాలా ఉపయోగకరమూనది. కుండలినీ శక్తిని జాగృతం చేసి పైకిలేపడానికి ఈ ఆసనం చాలా ఉపయోగకరం. కుండలినీ శక్తి శరీరంలోని వెన్నెముక క్రింది భాగమున చుట్టుకొని నిద్రపోతున్న సర్పంలా ఉంటుంది. ఈ కనిపించని అతర్గతముగా ఉన్న శక్తిని మేలుకొలిపి వెన్నెముక ద్వారా పైకి మెదడులోకి శక్తి వెళ్లడంతో అసమానమైన జ్ఞానము కలిగి మానవుడు అనుకున్నది సాదిస్తాడు.

Admin

Recent Posts