యోగా

Vajrasana Benefits : రోజూ ఈ ఆస‌నాన్ని 5 నిమిషాలపాటు వేసినా చాలు.. అన్ని ర‌కాల నొప్పులు త‌గ్గుతాయి..!

Vajrasana Benefits : మారిన మన జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, ఒకేచోట క‌ద‌ల‌కుండా కూర్చుని ప‌ని చేయ‌డం వంటి కార‌ణాల చేత ఈ స‌మస్యుల త‌లెత్తుతున్నాయి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. చాలా మంది ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి పెయిన్ కిల్ల‌ర్ ల‌ను, స్ప్రేల‌ను వాడుతూ ఉంటారు. వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం అంత మంచిది కాదు. ఇలా మోకాళ్ల నొప్పులు, మెడ నొప్పులు, న‌డుము నొప్పి వంటి వాటితో బాధ‌ప‌డే వారు పెయిన్ కిల్ల‌ర్ ల‌కు బ‌దులుగా ఆస‌నం వేయ‌డం వ‌ల్ల నొప్పి నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు విరాసనం వేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుందని ఈ ఆస‌నం వేయ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పులు త‌గ్గ‌డంతో పాటు మ‌రెన్నో ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని యోగా నిపుణులు చెబుతున్నారు. విరాసనం ఎలా వేయాలి… దీని వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఇత‌ర ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. విరాసనం వేయ‌డానికి గానూ ముందుగా వ‌జ్రాస‌న స్థితిలో కూర్చోవాలి. ఇప్పుడు మోకాళ్ల‌ను ద‌గ్గ‌ర‌గా ఉంచి అరికాళ్ల‌ను దూరంగా చాపి కూర్చోవాలి. త‌రువాత ఊపిరి పీల్చుకుంటూ న‌డుమును నిటారుగా ఉంచాలి. అలాగే భూజాల‌ను రిలాక్స్ ఉంచి అర చేతుల‌ను తొడ‌ల‌పై ఉంచాలి. ఇలా ఒక నిమిషం పాటు ఉండి మ‌ర‌లా రిలాక్స్ అయ్యి మ‌ర‌లా ఆస‌నం వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పుల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అంతేకాకుండా ఈ విరాస‌నం వేయ‌డం వ‌ల్ల అజీర్ణం స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల నుండి ఉప‌వ‌మ‌నం క‌లుగుతుంది.

how to do vajrasana and its benefits

ఆహారం తిన్న త‌రువాత ఈ ఆస‌నాన్ని 5 నిమిషాల పాటు వేయ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే విరాసనం వేసి దీర్ఘ‌శ్వాస తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నిరాశ‌, ఒత్తిడి, డిప్రెష‌న్, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అంతేకాకుండా ఒత్తిడిగా ఉన్న‌ప్పుడు ర‌క్త‌నాళాల‌పై తీవ్ర ఒత్తిడి ప‌డుతుంది. దీంతో ఆరోగ్యం దెబ్బ‌తిన‌డంతో పాటు అధిక ర‌క్త‌పోటు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది. ఇలా ఒత్తిడి స‌మ‌స్య‌ల‌తో బాధపడే వారు విరాస‌నం వేయ‌డం వల్ల ఒత్తిడి త‌గ్గి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఈ విధంగా రోజూ విరాస‌నం వేయ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి త‌గ్గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts