Adah Sharma : హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ అదా శర్మ. తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తను చేసే పోస్ట్‌లు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో హోలీ సందర్భంగా దిగిన ఫోటోలను షేర్ చేసింది.
చీరలో దిగిన ఈ ఫోటోస్ కుర్రకారు మతులను పోగొడుతున్నాయి. తెల్లచీరలో ఈ ముద్దుగుమ్మ కనువిందు చేసింది. బ్లాక్ మెటల్ ఆభరణాలు ధరించి, తడిచిన జుట్టుతో కెమెరా ముందు అందాలను ఆరబోసింది. తన ప్రతి పోస్ట్ అభిమానులను ఆశ్యర్యపరిచేలా ఉంటోంది. తాజాగా షేర్ చేసిన ఈ పోస్ట్‌కు కూడా హాస్యాన్ని జోడించింది. తన ఫోటోలతోపాటుగా.. ఈ హోలీ మీలోని నిజమైన రంగులను బయట పెడుతుందని.. అలాగే తనలోని నిజమైన రంగులను చూడడానికి స్వైప్ చేయండి అని.. ఇన్ స్టా లో రాసుకొచ్చింది.
తరువాత ఊసరవెల్లి ఫోటోను షేర్ చేసి మిగతా రోజులలో మీలోని నిజమైన రంగులను దాచి పెట్టండి.. అని పోస్ట్ చేసింది. కాగా ఆసక్తికరమైన క్యాప్షన్స్‌తో ఫోటోలను షేర్ చేసే కొద్ది మంది సెలెబ్రెటీస్ లో అదా శర్మ ఒకరు. అదా తరచూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.