యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ మనిషి దీర్ఘకాలంపాటు ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇది ఒక పట్టాన తగ్గదు. ఈ వ్యాధి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ జాబితాకు చెందుతుంది. ఈ వ్యాధి కీళ్లు, వెన్నెముక, తుంటి భాగాల్లో వస్తుంది. ప్రధానంగా 18 నుంచి 30 ఏళ్ల వయస్సు వారికి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది. పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఇబ్బందులు పెడుతుంది. హెచ్‌ఎల్‌ఏ బి27 ప్రోటీన్ జన్యువు ఉన్నవారిలో స్పాండిలైటిస్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వచ్చిన వారిలో వెన్నుపూసల మధ్య వాపు వస్తుంది. దీంతో వాపు వచ్చిన డిస్క్‌లు వెన్నెముకను పైకి జరుపుతాయి. వెన్నెముకతోపాటు పెల్విస్ కీళ్లు దీని వల్ల ప్రభావితం అవుతాయి. అయితే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల జరుగుతుంటుంది. అంటే.. తమ సొంత రోగ నిరోధక శక్తి తమ సొంత కీళ్లపైనే ప్రభావం చూపిస్తుందన్నమాట. దీంతో ఈ వ్యాధి ఆటో ఇమ్యూన్ వ్యాధుల జాబితాకు చెందుతుంది. ఈ క్రమంలో మన శరీరాన్ని రక్షించాల్సిన మన రోగ నిరోధక వ్యవస్థే మన శరీరంలోని కణజాలాన్ని నాశనం చేస్తుంది.
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వచ్చేందుకు కారణాలు
బాక్టీరియా ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి, వంశపారంపర్యంగా, జన్యుపరంగా, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం వల్ల, పలు ఇతర కారణాల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంటుంది.
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ లక్షణాలు
* విశ్రాంతి తీసుకున్నప్పుడు ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పనిచేస్తున్నప్పుడు తీవ్రత తగ్గుతుంది.
* కంటి సమస్యలు వస్తాయి. కళ్లు ఎర్రగా మారుతాయి.
* కీళ్లు, మెడ బిగుసుకుపోయి నొప్పి ఎక్కువగా ఉంటుంది.
* నడుము నొప్పి వస్తుంది.
* శరీరంలో పలు చోట్ల నొక్కితే గట్టిగా అనిపిస్తుంది.
ఎక్స్ రే, బ్లడ్ టెస్ట్‌లు చేసి ఈ వ్యాధిని నిర్దారిస్తారు.
చికిత్స
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఆమ వాతం వల్ల వస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇది ఇన్‌ఫ్లామేటరీ, రుమాటిక్ డిజార్డర్స్ జాబితాకు చెందుతుంది. వాత, కఫ దోషాల అసమతుల్యం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే కొన్ని సార్లు వాత, పిత్త, కఫ దోషాల్లో ఉండే అసమతుల్యాల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఆయుర్వేదంలో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కు చక్కని చికిత్స ఉంది. ఇందులో వెన్నెముక ప్రధాన భాగం కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని చికిత్స అందిస్తారు. అందువల్ల ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. చికిత్సలో భాగంగా పంచకర్మ వంటివి పాటించి శరీరాన్ని ముందుగా వ్యర్థాలు లేకుండా చూస్తారు. తరువాత పలు మందులను వాడి వ్యాధిని నయం చేసేందుకు యత్నిస్తారు. ఈ వ్యాధి తగ్గాలంటే కొంత ఎక్కువ కాలం పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ చికిత్సలో భాగంగా పంచకర్మ చేస్తే సుమారుగా 60 నుంచి 90 రోజుల పాటు ప్రక్రియలు చేస్తారు. కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఆరంభంలోనే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే త్వరగా వ్యాధి నయం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ చికిత్సలో రస్రజ్రస, అశ్వగంధ చూర్ణం, ఇరంద మూల చూర్ణం, చౌసత ప్రహరి, పిప్పలి చూర్ణం, త్రయోదశంగ గుగ్గుళ్లు వంటి ఆయుర్వేద ఔషధాలను వైద్యులు ఇస్తారు. వీటి వల్ల వ్యాధి త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకోవాల్సి ఉంటుంది.