Bananas : అరటి పండ్లను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ పండ్లు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. పైగా సామాన్యులకు కూడా తక్కువ ధరలో లభిస్తాయి. కనుక అరటి పండ్లను చాలా మంది కొని తింటుంటారు. అయితే అరటి పండ్లను తినడంలో చాలా మందికి ఒక సందేహం వస్తుంటుంది. అదేమిటంటే..
అరటి పండ్లను తిన్న తరువాత నీళ్లను తాగవచ్చా ? ఒకవేళ ఆ పండ్లను తిన్న తరువాత నీళ్లను తాగితే ఏమవుతుంది ? ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయా ? అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. అయితే దీనికి వైద్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండ్లను తిన్న తరువాత అనారోగ్య సమస్యలు వస్తాయని అనడంలో అర్థం లేదు. అరటి పండ్లను తిన్న తరువాత నీళ్లను తాగవచ్చు. నీళ్లను తాగితేనే మంచిది. ఎందుకంటే అరటి పండ్లలో నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది నీళ్లకు కాస్త విస్తరించినట్లు అవుతుంది. దీంతో పేగుల్లో ఆహారం చురుగ్గా కదులుతుంది. సులభంగా జీర్ణమవుతుంది. దీని వల్ల మలబద్దకం ఉండదు. గ్యాస్, అసిడిటీ కూడా తగ్గుతాయి. దీంతోపాటు శరీర మెటబాలిజం కూడా పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కనుక అరటి పండ్లను తిన్న తరువాత నీళ్లను తాగవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నీళ్లను తాగితేనే ఇంకా మంచిది.. అన్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోండి. అరటి పండ్లను తిన్న తరువాత నీళ్లను తాగితే ఏదో జరగుతుందనే అపోహలు వద్దు. నిర్భయంగా నీళ్లను తాగవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి.
ఇక అరటి పండ్లను తినడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మినరల్స్ కూడా మనకు లభిస్తాయి. ఇవన్నీ మనకు ఎంతో ఉపయోగపడతాయి. మనకు పోషణను, శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా మనల్ని అనారోగ్యాల బారిన పడకుండా చూస్తాయి. కనుక అరటి పండ్లను రోజుకు 1 లేదా 2 తింటే ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు.
ఈ పండ్లు సులభంగా జీర్ణమవుతాయి కూడా. వీటిని తిన్న తరువాత కేవలం 1 గంటలోపే వీటిల్లో ఉండే పోషకాలన్నింటినీ శరీరం శోషించుకుంటుంది. కనుక అతి తక్కువ సమయంలో పోషకాలు, శక్తి లభించాలంటే.. మనం అరటి పండ్లను తినాలి.
ఇక అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ పండును తింటే దాదాపుగా 420 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. ఈ క్రమంలోనే రోజుకు కనీసం 2 అరటి పండ్లను తింటే హైబీపీ తగ్గుతుంది. బీపీ తగ్గేందుకు పొటాషియం ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో గుండె పనితీరు మెరుగు పడుతుంది. గుండె జబ్బులు.. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. కనుక అరటి పండ్లను తప్పనిసరిగా రోజూ తినాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.