Washing Clothes : ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని జరగడం లేదు. కొందరి దగ్గర డబ్బు అధికంగా ఉంటే కొందరి దగ్గర నిత్యావసరాలను కొనుగోలు చేయడానికి కూడా డబ్బు ఉండడం లేదు. వారు సంపాదించిన డబ్బులు చాలక అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఎంతో బాధపడుతున్నారు. ఇలా ఇంట్లో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే మనపై లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే ఎటువంటి పేదవాడైనా ధనికుడు అవుతాడని పెద్దలు చెబుతుంటారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం మనందరం పూజలు చేస్తూ ఉంటాం. అనేక రకాల ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరికి లక్ష్మీ దేవి అనుగ్రహం లభించదు. అందుకు కారణం.. మనం మన ఇంట్లో తెలియక చేసే తప్పులే అని చెప్పవచ్చు.
మనం చేసే తప్పుల కారణంగా లక్ష్మీ దేవి కటాక్షం కలగక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ తప్పులను చేసి మనం పూజలను చేసినా ఫలితం ఉండదు. మనం ఇంట్లో చేసే పొరపాట్లు ఏమిటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గడపను మనం లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. కనుక గడపపై కూర్చోవడం, నిలబడడం, గడపను తొక్కడం వంటి పనులను చేయకూడదు. ఇలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నిలవదు.
ఇంట్లో ఎవరి తలకైనా నూనెను రాసి మళ్లీ అదే చేత్తో వేరొకరికి నూనెను రాయకూడదు. ఇలా రాయడం అశుభం అని పెద్దలు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఇంట్లో ఉండదు. మనం రోజూ విడిచిన బట్టలను ఉతుకుంటూ ఉంటాం. బట్టలను కేవలం ఉదయం పూట మాత్రమే ఉతకాలి. సాయంత్రం పూట బట్టలను ఉతికితే దరిద్రం చుట్టుకుంటుందని పెద్దలు చెబుతుంటారు. మంగళ, శుక్ర వారాల్లో బట్టలు ఉతకకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
మనం రోజూ స్నానం చేస్తుంటాం. స్నానం చేసిన తరువాత కాళ్లు, చేతుల తడి పూర్తిగా ఆరిన తరువాతే ఇంట్లో తిరగడం, మంచం మీద కూర్చోవడం వంటివి చేయాలి. తడి కాళ్లతో ఇంట్లో తిరగడం అశుభమని, ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనం నిలవదని పెద్దలు చెబుతున్నారు. అదే విధంగా ఇంట్లో ఎప్పుడూ మంచి మాటలనే మాట్లాడుకుంటూ ఉండాలి. అలాగే లక్ష్మీ దేవి స్వరూపంగా భావించే రోకలిని, చీపురును తన్నరాదు. ఈ నియమాలను పాటించడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి.