వేసవి కాలంలో సహజంగానే మనకు దాహం ఎక్కువగా అవుతుంటుంది. దీంతో చాలా మంది అనారోగ్యకరమైన కూల్ డ్రింక్స్‌ను తాగుతుంటారు. అయితే అందుకు బదులుగా సహజసిద్ధమైన డ్రింక్స్‌ను తాగితే దాంతో ఆరోగ్యానికి ఆరోగ్యం కలుగుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. శక్తి కూడా లభిస్తుంది. పోషకాలు అందుతాయి. ఈ క్రమంలోనే శరీరానికి చల్లదనాన్నిచ్చే సమ్మర్ స్పెషల్ కొబ్బరినీళ్లు, నిమ్మరసం డ్రింక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరినీళ్లు, నిమ్మరసం సమ్మర్ డ్రింక్ తయారీ విధానం
1. ఒక కప్పు తాజా కొబ్బరి నీళ్లను తీసుకోవాలి.
2. అర టేబుల్ స్పూన్ అల్లం రసం తీసుకోవాలి.
3. ఒక నిమ్మకాయ నుంచి పూర్తిగా రసాన్ని సేకరించాలి. 2 టేబుల్ స్పూన్ల చక్కెర పొడి కలపాలి. చక్కెర వద్దనుకుంటే తేనె వాడవచ్చు. లేదా ఈ రెండూ లేకుండానే ఈ డ్రింక్‌ను తయారు చేయవచ్చు.
4. ఆ మిశ్రమంలో 1/8 టీస్పూన్ నల్ల మిరియాల పొడిని కలపాలి. అలాగే తాజాదనం, చల్లదనం కోసం ఐస్ ముక్కలు వేయవచ్చు.
5. అన్ని పదార్థాలను బాగా కలిపాక ఒక బాటిల్‌లో ఆ మిశ్రమాన్ని పోసి బాగా షేక్ చేయాలి. దీంతో కొబ్బరి నీళ్లు, నిమ్మరసం సమ్మర్ స్పెషల్ డ్రింక్ తయారవుతుంది. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని తాగవచ్చు. లేదా అలాగే తాగవచ్చు.
బయట తిరిగేవాళ్లు థర్మల్ బాటిల్స్‌లో ఈ మిశ్రమాన్ని పోసి దగ్గర బాటిల్స్‌ను ఉంచుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఈ డ్రింక్‌ను తాజాగా తాగవచ్చు. దీంతో శక్తి, పోషకాలు లభిస్తాయి. శరీరానికి చల్లదనం కలుగుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. వేసవిలో వచ్చే జ్వరం, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక ఈ డ్రింక్‌లో అవసరం అనుకుంటే రుచి కోసం కొద్దిగా ఉప్పును కూడా కలుపుకోవచ్చు.