Dark Circles : కళ్ల చుట్టూ నల్లటి వలయాలు… ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. ముఖం తెల్లగా ఉన్నప్పటికి కళ్ల చుట్టూ నల్లటి వలయాల కారణంగా అందవిహీనంగా కనబడుతున్నారు. ఈ నల్లటి వలయాల కారణంగా కళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నల్లటి వలయాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. కళ్ల చుట్టూ ఉండే సిరలల్లో రక్త స్థాయిలు తగ్గడం కూడా ఒక ముఖ్యమైన కారణం. నిద్రలేమి కారణంగా కళ్ల చుట్టూ సిరల్లో రక్తప్రసరణ సాఫీగా సాగక కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలాగే ఎక్కువ సమయం కంప్యూటర్లు, సెల్ ఫోన్ లు వాడడం వల్ల కూడా కల్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.
ఇతరత్రా అనారోగ్య సమస్యల కారణంగా అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళన కారణంగా కూడా ఈ నల్లటి వలయాలు ఏర్పడతాయి. కళ్ల చుట్టూ ఉండే ఈ నల్లటి వలయాలను ఇంటి చిట్కాల ద్వారా తొలగించుకోవచ్చు. కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలను తొలగించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ కస్తూరి పసుపును వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వాడే ముందు కళ్లను శుభ్రంగా కడగాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ ప్యాక్ లా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు అలాగే ఉంచిన తరువాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చిట్కాను వారానికి 3 రోజుల పాటు వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు.
కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలను తొలగించే మరో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను వాడడం వల్ల కళ్ల చుట్టూ ఉండే వలయాలతో పాటు మచ్చలు, ముడతలు కూడా తొలగిపోతాయి. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కలబంద జెల్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ పసుపును వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న జెల్ ను ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని నిల్వ కూడా చేసుకోవచ్చు. ఈ జెల్ ను రోజూ రాత్రి నిద్రపోయే ముందు కళ్ల చుట్టూ రాసుకుని రాత్రంతా అలాగే ఉండాలి. ఉదయాన్నే చల్లటి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి.
ఈ చిట్కాను కళ్ల చుట్టూ నలుపు తొలగిపోయే వరకు వాడుతూనే ఉండాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల కళ్ల చుట్టూ ఉండే చర్మం పొడిబారకుండా ఉండడంతో పాటు నల్లటి వలయాలు, ముడతలు కూడా తొలగిపోతాయి. ఈ చిట్కాలను పాటిస్తూనే రోజుకు తగినంత నిద్రపోవాలి. పోషకాలను కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. మానసిక ఒత్తిడి, ఆందోళన మన దరి చేరకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు తొలగిపోవడమే కాకుండా భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయి.