తులసి… హిందువులు పవిత్రంగా భావించే చెట్టు, తులసి చెట్టును పూజిస్తే పాపాలు తొలగిపోతాయని అపార నమ్మకం. తులసి రసం తీసుకుంటే ఎటువంటి రోగాలు ధరిచేరవని పెద్దలంటుంటారు. మన ఆలయాలలో తులసి ప్రసాదం లేనిదే పూజ జరగదు. వచ్చిన భక్తులకు సకల పాపాలు తొలగి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ఈ తీర్థాన్ని అందిస్తారు. అన్ని చెట్లు, వృక్షాలు కార్బన్ డయాక్సైడ్ ను విడుదలచేస్తే ఒక్క తులసి చెట్టు మాత్రం రోజుకి 22 గంటలూ ప్రాణ వాయువును విడుదల చేస్తుంది. హిందువులు పవిత్రంగా భావించే తులసి చెట్టు ప్రతి ఇంటి ఆవరణలో ఉంటుంది. మన ఇంటి ఆవరణలో ఉన్న తులసి మొక్క గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని సంగతులు.
పురాణాల కథ ప్రకారం శివుడిని తులసి ఆకులతో పూజించరాదు. రాక్షస రాజైన శంఖచూడుడు చేసిన తప్పులకు శివుడు శంఖచూడుడుని శూలంతో సంహరిస్తాడు. శంఖచూడుడి భార్య తులసి వృక్షంగా మారిపోతుంది. ఆ రాక్షస రాజును చంపిన కారణంగా శివుడిని తులసి ఆకులతో పూజించరు. పవిత్రమైన తులసి ఆకులను ఆదివారం, మంగళవారం, శుక్రవారం.. ద్వాదశి, ఏకాదశి, పూర్ణిమ తిథులలోనూ, రాత్రి పూట కోయరాదు, ముట్టుకోకూడదు. తులసి చెట్టుకు ఉదయం,సాయంత్రం సమయాలలో భక్తిశ్రద్ధలతో పూజించడం వలన సాక్ష్యాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, మన ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని విశ్వాసం.
ప్రతి ఇంట్లో ఒక తులసి చెట్టు ఉంటే ఎటువంటి రోగాలు మన దరికి చేరవు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తులసి ఆకులను, తులసి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మన ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవ్వవు. తులసిని ప్రత్యేక ఔషధంగా ప్రతి ఒక్క ఆయుర్వేదంలోను వాడతారు. తులసి విష్ణుమూర్తికి ప్రీతిప్రాతం. తులసి చెట్టు చుట్టూ దీపారాధన చేస్తే సకలు పాపాలు తొలగి, ఆయురోగ్యాలతో సుఖంగా ఉంటారు. మన ఇంటి ఆవరణలో ఒక తులసి చెట్టు ఉండడం వలన జరిగే మంచి ఇక దేనివల్ల జరగదు. పరిశోధనలు జరిపే శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు తులసిలో ఉన్న మంచి గుణాలను గుర్తించారు.