Home Remedies For Thyroid : శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒకటి. ఇది శారీరక ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పని తీరు తప్పడం వల్ల హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది జీవక్రియల రేటును నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంథి శరీరానికి సరిపడా థైరాక్సిన్ హార్మోన్ ను విడుదల చేయకుంటే హైపో థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది. దీని కారణంగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ ను ఎక్కువగా విడుదల చేయడం వల్ల హైపర్ థైరాయిడిజం సమస్య తలెత్తుతుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.
అలాగే ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్య బారిన పడితే మనం జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. థైరాయిడ్ కారణంగా బరువు పెరగడం, జుట్టు రాలడం, మలబద్దకం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వకపోవడం, కీళ్ల నొప్పులు, తిమ్మిర్లు, సంతాన లేమి సమస్యలు, షుగర్ వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. థైరాయిడ్ వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడంతో పాటు థైరాయిడ్ ను కూడా నియంత్రించడంలో ఉల్లిపాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు ఉల్లిపాయను ఏవిధంగా వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక ఉల్లిపాయను గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను ఒక దాని తరువాత ఒకటిగా కంఠంపై థైరాయిడ్ గ్రంథి ఉన్న చోట రుద్దుకోవాలి. మెడ చుట్టు ఏమి ధరించకుండా రాత్రంతా అలాగే నిద్రించాలి. ఇలా కొన్ని వారాల పాటు చేయడం వల్ల థైరాయిడ్ నియంత్రణలోకి వస్తుంది. అదే విధంగా ఒక ఉల్లిపాయను ముక్కను థైరాయిడ్ గ్రంథిపై ఉంచి వస్త్రంతో కట్టు కట్టుకుని రాత్రంతా అలాగే నిద్రించాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ఒక జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల హైపో థైరాయిడిజం సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఒక కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే అల్లం ముక్కలు, దాల్చిన చెక్క పొడి వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల క్రాన్ బెర్రీ జ్యూస్ ను కలపాలి.
ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను తాగడం వల్ల హైపో థైరాయిడ్ నియంత్రణలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ధనియాల కషాయాన్ని తాగడం వల్ల కూడా థైరాయిడ్ ను మనం నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో రుచి కొరకు తేనెను కూడా తీసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు తాగడం వల్ల థైరాయిడ్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలను పాటిస్తూనే చక్కటి ఆహార నియమాలను, జీవన విధానాన్ని అవలంబించడం వల్ల థైరాయిడ్ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.