Bananas : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో అరటి పండు కూడా ఒకటి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దాదాపు సంవత్సరమంతా ఇది మనకు విరివిరిగా లభిస్తూ ఉంటుంది. అరటి పండులో చాలా రకాలు ఉన్నాయి. అరటి పండు శాస్త్రీయ నామం మ్యూసా పారడైసికా. దీనిని హిందీలో ఖేలా అని, సంస్క్రతంలో కదలి అనే పేర్లతో పిలుస్తారు. అరటి పండును తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ దాదాపుగా లభిస్తాయి. అరటి పండు సంపూర్ణ ఆహారమనే చెప్పవచ్చు. కేవలం అరటి పండే కాకుండా అరటి చెట్టులో ప్రతి భాగం కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అరటిపండు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అలాగే దీనిని తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండును తినడం వల్ల నీరసం తగ్గుతుంది. వెంటనే శక్తి లభిస్తుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు అరటి పండును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే కడుపులో పుండ్లను, అల్సర్లను తగ్గించడంలో అరటి పండు దోహదపడుతుంది. అదే విధంగా విరోచనాలతో బాధపడే వారు అరటి పండును తీసుకోవడం వల్ల విరోచనాలు తగ్గుతాయి. అలాగే అరటి పండును తినడం వల్ల చాలా మంది వాతం చేస్తుందని దీనిని తినడానికి సందేహిస్తూ ఉంటారు. కానీ కీళ్ల నొప్పులను, వాపులను తగ్గించడంలో అరటి పండు ఉపయోగపడుతుంది.
ఎటువంటి ఆహారాలను తీసుకోకుండా రోజుకూ 8 అరటి పండ్లను 4 రోజుల పాటు తినడం వల్ల వాతం వల్ల కలిగే కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతుంటారు. రక్తహీనత సమస్యతో బాధపడే వారు అరటి పండును తినడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అలాగే యూరియా స్థాయిలు పెరిగి ఇబ్బందులకు గురి అవుతున్న వారు 4 రోజుల పాటు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా అరటి పండును మాత్రమే తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే క్షయ వంటి వ్యాధులతో బాధపడే వారు ఉడికించిన అరటి పండ్లను జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు అరటి పండును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించడంలో అరటి పండు కంటే అరటి బోదే మరింతగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అరటి బోదే రసాన్ని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారు అరటి పండును తినడం వల్ల మరింత లావుగా అవుతారని భావిస్తూ ఉంటారు. కానీ అరటి పండును తీసుకోవడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే అరటి పువ్వును కూరగా వండుకుని తినడంతో పాటు అరటి పండును తినడం వల్ల మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా అనేక రకాలుగా అరటి పండు మనకు ఉపయోగపడుతుందని దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను చాలా సులభంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.