Fenugreek Seeds For Knee Pain : మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో మోకాళ్ల నొప్పిసమస్య కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో ఈ మోకాళ్ల నొప్పులతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ సమస్య కారణంగా నడవడం, మెట్లు ఎక్కడం, కూర్చోవడం చాలా కష్టమవుతుంది. చివరికి వారి పనులను కూడా వారు చేసుకోలేకపోతుంటారు. మోకాళ్ల నొప్పుల వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. మోకాళ్ల నొప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అధిక బరువు, ఎక్కువ సేపు కూర్చొని ఉండడం, వ్యాయామం చేకపోవడం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం, క్యాల్షియం లోపం, జంక్ ఫుడ్ మరియు యాసిడ్ నేచర్ ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వంటి రకరకాల కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది.
కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి చాలా సులభంగా మనం మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా చూసుకోవచ్చు. మోకాళ్ల నొప్పులు రాకుండా ఉండాలనుకునే వారు ఎక్కువగా కింద కూర్చొని భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. కింద కూర్చొని లేవడం వల్ల మోకాళ్లకు తగినంత వ్యాయామం లభిస్తుంది. అలాగే మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు పొట్టు నువ్వుల నుండి తీసిన నూనెను మోకాళ్లపై రాస్తూ నూనె చర్మం లోపలికి ఇంకేలా ఒకే దిశలో మర్దనా చేయాలి.
తరువాత మోకాళ్లకు వేడిగా ఉండేలా మందపాటి వస్త్రంతో మోకాళ్ల చుట్టూ చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రారంభ దశలో ఉన్న మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. అదే విధంగా ఉసిరి పొడి, మెంతి పొడి, పసుపును సమపాళ్లల్లో తీసుకుని బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీళ్లల్లో వేసి కలపాలి. ఈ నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. మోకాళ్ల నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకున్న నీటిని పూటకు ఒక గ్లాస్ మోతాదులో మూడు పూటలా భోజనానికి అరగంట ముందు తాగాలి. మోకాళ్ల నొప్పులు తగ్గే కొద్ది ఈ నీటిని తీసుకునే మోతాదును కూడా తగ్గిస్తూ ఉండాలి.
మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడంవల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. చాలా మోకాళ్ల నొప్పులు రాగానే పెయిన్ కిల్లర్ లను, ఆయింట్ మెంట్ లను వాడుతూ ఉంటారు. వీటికి బదులుగా ఈ చిట్కాలను వాడడం వల్ల మంచి ఫలితం ఉండడంతో పాటు ఎటువంటి దుష్ప్రభావాల బారిన కూడా పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.