Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home యోగా

మనిషికి శక్తినిచ్చే ప్రాణాయామం.. రోజూ చేస్తే ఎంతో మేలు..!

Admin by Admin
June 6, 2021
in యోగా
Share on FacebookShare on Twitter

మనిషి నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో గడుపుతున్నాడు. అలాంటి జీవిత విధానంలో ప్రాణాయామం శరీరానికి శక్తిని అందిస్తుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. ప్రాణాయామం అంటే శక్తిని మేల్కొల్పడం. ఇది నిజానికి మనకు దివ్యౌషధం లాంటిది. మనపై మనకు ఆత్మ విశ్వాసం పెరిగేలా చేస్తుంది. మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది.

daily do pranayama for physical and mental health

శ్వాసను నియంత్రించడమే ప్రాణాయామం ప్రక్రియలో ముఖ్యమైన భాగం. ప్రాణాయామం చేయడం వల్ల శరీరం తేలిగ్గా మారుతుంది. ప్రాణాయామానికి ఉన్న శక్తి అనంతమైందని ఆయుర్వేదం చెబుతోంది. ప్రస్తుతం మనిషి ఎదుర్కొంటున్న అనేక శారీరక, మానసిక సమస్యలను ప్రాణాయామం ద్వారా తగ్గించుకోవచ్చు.

ప్రాణాయామం అంటే శ్వాస నియంత్రణ. సంస్కృతంలో ప్రాణ అంటే కీలక ప్రాణశక్తి. శ్వాస గ్రహించడానికి కీలకమైన శక్తిని ఆయామ అంటారు. ప్రాణ ఆయామము అంటే ప్రాణశక్తిని (శ్వాస) నియంత్రించడమే. ప్రాణాయామ సాధన అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఒక క్రమంలోకి తేవడానికి ప్రయత్నించడం. శ్వాసను పీల్చినప్పుడు పొట్ట ఒక క్రమ పద్ధతిలో ముందుకు వచ్చి శ్వాస వదిలినప్పుడు పొట్ట ఖాళీ అవ్వాలి. నేడు ప్రాణాయామం చేస్తున్న చాలా మందికి ఈ విధంగా శరీరం సహకరించడం లేదు.

ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ప్రాణశక్తి అంటారు. శ్వాస అనేది శరీరానికి, మనస్సుకు సంబంధాన్ని ఏర్పరుస్తుంది. శరీరం, మనస్సు ఒకదానిపై ఒకటి ఆధార పడ్డాయి. శ్వాసను నియంత్రిస్తే ప్రాణశక్తి ఆధీనంలోకి వస్తుంది. దీంతో శరీర సమస్యలతోపాటు మానసిక వ్యాధులు తగ్గుతాయి. శ్వాసలో ప్రాణ శక్తి ఉంటుంది. కనుక దాన్ని నియంత్రిస్తే ఆరోగ్యం మెరుగు పడుతుంది.

ప్రాణాయామాన్ని ఎవరైనా సొంతంగా చేయవచ్చు. కానీ గురువు వద్ద అభ్యసిస్తే ఇంకా చక్కగా ప్రాణాయామం చేయగలుగుతారు. ప్రాణాయామాన్ని రోజూ వేకువ జామున 3 నుంచి 4 గంటల మధ్యలో చేయాలి. ఆ సమయాన్ని అమృత ఘడియలు అని పిలుస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో అంత ఉదయాన్నే ఎవరూ మేల్కొనరు. కనుక కనీసం ఉదయం 5-6 గంటల మధ్యలో అయినా ప్రాణాయామం చేస్తే మంచిది.

ప్రాణాయామం చేసేందుకు ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. తల, మెడ, ఛాతి, వెన్నెముకలను నిటారుగా ఉంచాలి. శ్వాసను క్రమబద్దం, లయబద్దం చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై దృష్టి పెట్టాలి. దీంతో ప్రాణాయామం సులభంగా చేయవచ్చు. కేవలం శ్వాస పీల్చుకుని వదిలేస్తే ప్రాణాయామం కాదు. మనస్సును దానిపై కేంద్రీకరించాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. పీల్చే గాలి, వదిలే గాలిపైనే ధ్యాస ఉంచాలి. వేరే ఆలోచనలను మదిలోకి రానివ్వకూడదు.

ఇక ప్రాణాయామంలో అనేక రకాలు ఉంటాయి. అన్నింటినీ రోజూ చేయలేరు. కానీ ఆరంభంలో సాధారణంగా అందరూ చేసే ప్రాణాయం చేయవచ్చు. అంటే ఒక నాసికా రంధ్రాన్ని మూసి మరో రంధ్రంతో గాలి పీల్చాలి. దాన్ని అలాగే పట్టి ఉంచి ఇంకో రంధ్రంతో గాలిని బయటకు వదలాలి. ఇక పలు ఇతర రకాల ప్రాణాయామాలు కూడా ఉంటాయి. వాటిని గురువు వద్ద అభ్యసించడం మేలు. ఒక్కో ప్రాణాయామాన్ని కనీసం 9 సార్లు చేయాలి. రోజూ అభ్యసిస్తే ప్రాణాయామాన్ని సులభంగా చేయవచ్చు.

ప్రాణాయామం వల్ల మానసిక స్థితి మెరుగు పడుతుంది. మనస్సు అదుపులోకి వస్తుంది. అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. బీపీ, షుగర్‌ ఉన్నవారు రోజూ ప్రాణాయామం చేస్తే కొంత కాలానికి మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. ప్రాణాయామం చేయడం వల్ల గుండె, పొత్తి కడుపు, ఊపిరితిత్తులు దృఢంగా మారుతాయి.

ప్రాణాయామాన్ని ప్రకృతి చేయడం మంచిది. ఖాళీ కడుపుతో దీన్ని చేయాలి. ప్రాణాయామం ప్రారంభించే ముందు పద్మాసనంలో కొంత సేపు విశ్రాంత స్థితిలో కూర్చోవాలి. ఆరంభంలో రోజూ 15 నిమిషాల పాటు ప్రాణాయామం చేయవచ్చు. తరువాత ఎవరైనా తమ సౌకర్యానికి అనుగుణంగా దీన్ని చేయవచ్చు. కూర్చునే చోటు సమతలంగా ఉండాలి. ప్రాణాయామం తరువాత వెంటనే స్నానం చేయరాదు. కనీసం 30 నిమిషాల వ్యవధి ఉండాలి. కేవలం కూర్చుని మాత్రమే ప్రాణాయామం చేయాలి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: pranayamamప్రాణాయామం
Previous Post

మెడ భాగంలో న‌ల్ల‌గా ఉందా ? ఈ చిట్కాలు పాటించండి..!

Next Post

వంట నూనెల గురించి పూర్తి వివరాలు.. ఏ నూనె మంచిదో తెలుసుకోండి..!

Related Posts

యోగా

ధ్యానం వల్ల కలిగే 7 అద్భుత‌మైన‌ ప్రయోజనాలు

June 25, 2025
యోగా

ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే…3 శ్వాస వ్యాయామాలు..

June 20, 2025
యోగా

ఆఫీసులో కుదిరితే ఈ చిన్న‌పాటి యోగాస‌నాలు వేయండి.. ఎంతో ఫ‌లితం ఉంటుంది..

June 17, 2025
యోగా

హైబీపీ ఉన్న‌వారు ఈ ఆస‌నాల‌ను వేస్తే ఎంతో ఫ‌లితం ఉంటుంది..!

June 16, 2025
యోగా

ఆస్త‌మాతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ యోగాస‌నాల‌ను వేయండి..

May 31, 2025
యోగా

థైరాయిడ్ గ్రంధుల పనితీరు మెరుగుపరిచే ప్రాణ ముద్ర..!

May 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.