Cumin And Coriander Seeds : మన ఇంట్లో ఉండే రెండు మసాలా దినుసులను ఉపయోగించి మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ మసాలా దినుసులను ఉపయోగించడం వల్ల దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, అధిక బరువు, జీర్ణ సంబంధిత సమస్యలు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మన అనారోగ్య సమస్యలను దూరం చేసే ఈ మసాలా దినుసులు ఏమిటి.. వీటిని వాడడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అలాగే వీటిని ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ మసాలా దినుసులు మరేమిటో కాదు జీలకర్ర మరియు ధనియాలు. ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేవే. వీటిని వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. జీలకర్ర అలాగే ధనియాలను ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. జీలకర్రలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి మనల్ని అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి. జీలకర్రను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతకవ్యాధుల బారిన పడకుండా ఉంటాము. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, అధిక బరువు సమస్య నుండి బయటపడేయడంలో ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే జీలకర్రలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా జీలకర్రను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అదే విధంగా ధనియాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ధనియాలు మనకు ఎంతో దోహదపడతాయి.
ధనియాలను ఉపయోగించడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ సమస్యలను తగ్గించడంలో, మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ధనియాలు మనకు సహాయపడతాయి. ఈ విధంగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ధనియాలను, జీలకర్రను ఎలా ఉపయోగించాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రను, ఒక టీ స్పూన్ ధనియాలను వేసి మరిగించాలి. ఇందులోనే రెండు చిటికెల మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. ఈ నీటిని సగం అయ్యే వరకు మరిగించి గోరు వెచ్చగా అయ్యే వరకు అలాగే ఉంచాలి.
తరువాత ఈ నీటిని వడకట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ కషాయాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. ఈ విధంగా ఈ కషాయాన్ని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.