White Teeth With Carrot : క్యారెట్లను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. క్యారెట్లలో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యారెట్లను తింటే కంటిచూపు మెరుగు పడుతుంది. అధిక బరువు తగ్గుతారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇలా క్యారెట్లతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మీకు తెలుసా.. క్యారెట్లతో మీ దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక క్యారెట్‌ను తీసుకుని గ్రేటర్‌తో దాన్ని తురమాలి. అనంతరం దాంట్లో నుంచి 2 టేబుల్ స్పూన్ల రసాన్ని తీయాలి. ఆ రసంలో 1 టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ ఉప్పు వేసి కలపాలి. అనంతరం మీరు రోజూ వాడే టూత్ పేస్ట్‌ను కూడా అందులో కాస్త వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తరువాత దాంతో దంతాలను తోమాలి. తరువాత 2 నిమిషాల పాటు వేచి ఉండి కడిగేసుకోవాలి.
ఇలా దంతాలను వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు శుభ్రం చేసుకుంటే చాలు.. దాంతో దంతాలు తెల్లగా మారుతాయి. పసుపు దంతాలు, ఎలాంటి గార పట్టిన దంతాలు అయినా సరే తెల్లగా మారి మెరుస్తాయి. ఇలా చేయడం వల్ల నోరు, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ల వాపులు, రక్త కారడం తగ్గుతాయి. అలాగే నోటి దుర్వాసన నుంచి విముక్తి కలుగుతుంది. క్యారెట్‌తో ఈ విధంగా ఎవరైనా సరే దంతాలను ఎంతో తెల్లగా మార్చుకోవచ్చు.