Vaamaku For Lungs : మనలో చాలా మంది ఆస్థమా, న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యల వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలాల్లో ఈ సమస్యల కారణంగా మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యలతో బాధపడే వారు తప్పకుండా మందులు వాడాల్సిందే. అయితే మందులతో పాటు వామాకును వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇటువంటి సమ్యలతో బాధపడే వారి ఊపిరితిత్తులల్లో హిస్టమిన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. హిస్టమిన్స్ ఎక్కువగా ఉత్పత్తి అయితే ఊపిరితిత్తుల్లో ఇబ్బంది, చికాకు అంత ఎక్కువగా ఉంటుంది.
అలాగే హిస్టమిన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల శ్లేష్మాలు ఎక్కువగా ఉత్పత్తి మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. ఆస్థమా తగ్గకుండా ఎక్కువ రోజుల పాటు వేధిస్తూ ఉంటుంది. ఆస్థమా, న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడే వారు వామాకును వాడడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వామాకులో థైమాల్, కార్వకాల్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులల్లో హిస్టమిన్స్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేయడంలో సహాయపడతాయి. ఈ హిస్టమిన్స్ ఎంత తక్కువగా ఉత్పత్తి అయితే ఊపిరితిత్తుల్లో ఇబ్బంది అంత తక్కువగా ఉంటుంది. అలాగే శ్లేష్మాలు ఉత్పత్తి కాకుండా ఉంటాయి. సమస్య త్వరగా తగ్గు ముఖం పడుతుంది. ఈ విధంగా వామాకు ఆస్థమా, న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేస్తున్నారు. ఇరాన్ దేశ శాస్త్రవేత్తలు వామాకుపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.
సాధారణంగా వామాకును మనం వంటల్లో వాడుతూ ఉంటాము. వామాకు చక్కటి వాసనను కలిగి ఉంటుంది. వామాకు చెట్టును పెంచడం చాలా సులభం. ముదురు ఆకులను తెంచే కొద్ది ఈ మొక్కకు కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. కుండీల్లో కూడా ఈ మొక్క సులభంగా పెరుగుతుంది. ఆస్థమా, న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడే వారు తప్పకుండా ఇళ్లల్లో వామాకు మొక్కను పెంచుకోవాలి. దీనితో పచ్చడిని చేసి తీసుకోవచ్చు. అలాగే నీటిలో వామాకులను వేసి మరిగించి ఈ నీటిని తాగవచ్చు. ఇలా ప్రతిరోజూ కొన్ని వామాకులను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఆస్థమా, న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.