Sharing Soap : మనం ప్రతిరోజూ సబ్బును ఉపయోగించి స్నానం చేస్తూ ఉంటాము. చర్మతత్వాన్ని బట్టి వివిధ రకాల సబ్బులను ఉపయోగించి స్నానం చేస్తూ ఉంటాము. అయితే కొందరు ఎవరి సబ్బును వారు ఉపయోగించి చేస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం ఇతరుల సబ్బుతో స్నానం చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబంలో అందరూ ఒకే సబ్బుతో స్నానం చేస్తూ ఉంటారు. హాస్టల్స్ లో, బ్యాచిలర్ రూమ్స్ లో ఒకరి సబ్బుతో ఒకరు స్నానం చేయడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే ఇలా ఒకే సబ్బుతో ఇంట్లో అందరూ స్నానం చేయవచ్చా, ఇతరుల సబ్బును ఉపయోగించి మనం స్నానం చేయవచ్చా, చేస్తే ఏమవుతుంది.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇతరుల సబ్బులను ఉపయోగించి స్నానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఒకే సబ్బుతో ఇంట్లో అందరూ స్నానం చేయకూడదని వారు సూచిస్తున్నారు. ఎందుకంటే సబ్బుపై 5 రకాల సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఉందని నిపుణులు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే ఈ క్రిములు ఒకరి నుండి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. సబ్బుపై ఇకోలి, సాల్మొనెల్లా, షిగెల్లా బ్యాక్టీరియా, నోరో వైరస్, స్టాఫ్, రోటా వైరస్ వంటి క్రిములు, వైరస్ లు ఉండే అవకాశం ఉంది. ఇవి చర్మంపై పడిన గాయాలు, దెబ్బలు అలాగే మలం ద్వారా వ్యాపిస్తాయి. అయితే నిపుణులు మరో ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసారు. సబ్బుపై క్రిములు ఉన్నప్పటికి అవి ఒకరి నుండి మరొకరికి వ్యాపి చెందినప్పటికి వ్యాధులు మాత్రం వ్యాప్తి చెందకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉన్నప్పటికి ఒక ఇన్ఫెక్షన్ మాత్రం వ్యాప్తి చెందే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
యాంటీ బయాటిక్ రెసిస్టెంట్ స్టాఫ్ ఇన్ఫెక్షన్ అయిన మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే అంటువ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కనుక ఒకరి సబ్బులను మరొకరు ఉపయోగించకపోవడమే మంచిదని వారు చెబుతున్నారు. అయితే బాడీ వాష్ లను, లిక్విడ్ సోప్ లను ఇతరులవైన వాడుకోచ్చని వారు చెబుతున్నారు. అలాగే ఒకే సబ్బును ఇంట్లో అందరూ పంచుకున్నట్టయితే సబ్బును వాడే ముందు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే సబ్బుపై ఎక్కువ నురుగు ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా సబ్బు ఎల్లప్పుడూ పొడిగా ఉండేలా చేసుకోవాలి. సబ్బును పొడిగా ఉంచడం వల్ల బ్యాక్టీరియా వృద్ది చెందే అవకాశం ఉంది. కనుక సబ్బును ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. మనం ఇతరుల సబ్బును వాడకపోవడమే మంచిదని ఎవరి సబ్బును వారు ఉపయోగించడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.