Dates And Beetroot Juice : మనకు సులభంగా లభించే పదార్థాలతో జ్యూస్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట చాలా మంది టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. వీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి లాభం ఉండదు. కనుక వీటికి బదులుగా ఈ జ్యూస్ ను తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే దీనిని తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక చిన్న బీట్ రూట్ ను, ఒక దానిమ్మకాయను, ఒక టమాట కాయను, 5 ఎండుద్రాక్షలను, 3 గింజలు తీసిన ఖర్జూర పండ్లను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా బీట్ రూట్ తొక్క తీసి ముక్కలుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి. ఇందులోనే టమాట ముక్కలు, ఎండుద్రాక్ష, ఖర్జూర పండ్లు, దానిమ్మగింజలు వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ జ్యూస్ ను వడకట్టి గ్లాస్ లో పోసుకుని తాగాలి. ఇలా జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే ఈ జ్యూస్ ను తాగడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.
మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. బరువు కూడా సులభంగా తగ్గవచ్చు. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. నీరసం, బలహీనత వంటి సమస్యలతో బాధపడే వారు ఈ జ్యూస్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో కూడా ఈ జ్యూస్ మనకు దోహదపడుతుంది. ఈ విధంగా రోజూ ఉదయం అల్పాహారంలో భాగంగా ఈ జ్యూస్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.