అరటిపండ్లను సూపర్ ఫుడ్ గా భావిస్తారు. చాలా మంది అరటి పండ్లను ఇష్టంగా తింటారు. అయితే వీటితో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. వీటిని ఫేస్ ప్యాక్, హెయిర్ మాస్క్ లుగా కూడా ఉపయోగించుకోవచ్చు. జుట్టు, చర్మానికి అరటి పండ్లు చాలా మేలు చేస్తాయి. రోజూ ఈ పండ్లను తినడం వల్ల మీ ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. అరటిపండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. మన చర్మాన్ని మరింత అందంగా మార్చడానికి వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి.
1. అరటి పండ్లలో పొటాషియం, మాంగనీస్ లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయ పడతాయి. చర్మంలో కొల్లాజెన్ ను పెంచడానికి మాంగనీస్ సహాయపడుతుంది. కొల్లాజెన్ అనేది చర్మ కణాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఒక రకమైన ప్రోటీన్. ఇది చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. ముఖంపై వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది.
2. అరటి పండ్లలో పొటాషియం ఉంటుంది. ఇది చర్మ కణాలకు ఆక్సిజన్, రక్తం రెండింటి ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. పొటాషియం చర్మానికి ప్రకాశాన్ని అందించడంలో సహాయపడుతుంది.
3. రోజూ అరటి పండ్లను తినడం వల్ల ముఖం మీద మెరుపు పెరుగుతుంది. ఈ పండ్లు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి.
4. అరటి పండు చర్మ సమస్యలను త్వరగా నయం చేస్తుంది. రోజూ అరటి పండ్లు తినే వారిలో చర్మ కణాలు వేగంగా మరమ్మత్తులకు గురవుతాయి. దీంతో చర్మం సురక్షితంగా ఉంటుంది. అరటి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది.
5. అరటి పండ్లలో ఇనుము, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి వివిధ పోషకాలు ఉంటాయి. అరటి పండ్లలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దృఢంగా ఉండడానికి సహాయపడతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365