Instant Rice Idli : ఇడ్లీలు.. మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో ఇది కూడా ఒకటి. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. సాధారణంగా ఇడ్లీలను మినపప్పు, ఇడ్లీ రవ్వతో తయారు చేస్తూ ఉంటాము. తరుచూ ఒకేరకంగా కాకుండా ఈ ఇడ్లీలను మనం బియ్యం రవ్వతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా చేసే ఈ రైస్ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఉదయం అల్పాహారంగా ఏం తీసుకోవాలో తెలియనప్పుడు, సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా రైస్ ఇడ్లీలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఇన్ స్టాంట్ గా రైస్ ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ రైస్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పలుచటి అటుకులు- ఒక కప్పు, పుల్లటి మజ్జిగ – ఒక కప్పు, బియ్యం రవ్వ – ఒకటింపావు కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్.
ఇన్ స్టాంట్ రైస్ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అటుకులను తీసుకోవాలి . తరువాత మజ్జిగ పోసి నానబెట్టాలి. తరువాత అటుకులను మెత్తగా చేసుకోవాలి. తరువాత రవ్వ, ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత తగినన్ని మజ్జిగ పోసి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. దీనిని అరగంట పాటు నానబెట్టిన తరువాత అవసరమైతే మరికొద్దిగా మజ్జిగను పోసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ లను తీసుకుని అందులో పిండిని వేసుకోవాలి. తరువాత ఈ ప్లేట్ లను ఇడ్లీ పాత్రలో ఉంచి 8 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై 4 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ ఇడ్లీలను బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత వీటిని ప్లేట్ లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ రైస్ ఇడ్లీ తయారవుతుంది. వీటిని చట్నీ, సాంబార్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఇడ్లీలను కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.