Vankaya Curry : మనం వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వంకాయలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. ఈ వంకాయలతో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా కింద చెప్పిన విధంగా చేసే కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అన్నం, చపాతీ, పులావ్, బిర్యానీ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఒక్కసారి ఈ కర్రీని రుచి చూస్తే మళ్లీ ఇదే కర్రీ కావాలని అడుగుతారు. ఎవరైనా ఈ వంకాయ కర్రీని రుచిగా, తేలికగా తయారు చేసుకోవచ్చు. మరింత రుచిగా, కమ్మగా వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తెల్ల వంకాయలు – 300 గ్రా., టమాటాలు – 2, పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 10, పచ్చిమిర్చి – 4 నుండి 6, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, నూనె- 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉల్లితరుగు – అర కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, పచ్చిబఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ముప్పావు కప్పు, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్.
వంకాయ కర్రీ తయారీ విధానం..
ముందుగా తెల్ల వంకాయలను పొడుగ్గా కట్ చేసి నీటిలో వేసుకోవాలి. తరువాత జార్ లో టమాట ముక్కలు, కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత వంకాయ ముక్కలు, పచ్చిబఠాణీ వేసి కలిపి మూత పెట్టాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలను మగ్గించాలి.
వంకాయ ముక్కలు మగ్గిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టి చిన్న మంటపై 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ కర్రీ తయారవుతుంది. వంకాయలు ఇష్టపడని వారు ఈ కర్రీని ఇష్టంగా తింటారు.